U19 ఆసియా కప్.. మలేషియాపై భారత్ విజయం

by Muthe.Rajitha |

అండర్‌–19 ఆసియా కప్‌లో భారత్‌ మలేసియాపై ఘన విజయం సాధించింది.

U19 ఆసియా కప్.. మలేషియాపై భారత్ విజయం
X

దిశ, వెబ్ డెస్క్ : అండర్‌–19 ఆసియా కప్‌లో భారత్‌ మలేసియాపై ఘన విజయం సాధించింది. దుబాయ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్‌ 50 ఓవర్లలో 408 పరుగులు చేసి భారీ స్కోరు నమోదు చేసింది. అభిజ్ఞాన్‌ కుందు అద్భుతమైన డబుల్‌ సెంచరీ (209)తో జట్టును ముందుకు నడిపించాడు. అనంతరం 409 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మలేసియా భారత బౌలర్ల ధాటికి కేవలం 32.1 ఓవర్లలో 93 పరుగులకే ఆలౌటైంది. దీపేశ్‌ దేవంద్రన్‌ 5 వికెట్లు తీసి మెరిసగా, మోహన్‌ 2 వికెట్లు, కిషన్‌, ఖిలాన్‌ పటేల్‌, కనిష్క్‌ తలో ఒక్కో వికెట్‌ తీశారు. దీంతో భారత్‌ 315 పరుగుల తేడాతో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకుంది.

Next Story