రెండేళ్ల తరువాత.. కేన్ మామ సెంచరీ

by Disha Web Desk 1 |
రెండేళ్ల తరువాత.. కేన్ మామ సెంచరీ
X

దిశ, వెబ్ డెస్క్: ప్రపంచ క్రికెట్ ను శాసిస్తున్న నలుగురు ప్లేయర్లు విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్, కేన్ విలిమయ్ సన్, జో రూట్. టెస్టు క్రికెట్‌లో ఈ నలుగురు అద్భుత రికార్డులు నెలకొల్పి, మిగిలిన ప్లేయర్ల కంటే స్పెషల్‌గా నిరూపించుకున్నారు. అంతేకాకుండా ఈ నలుగురు టెస్టుల్లో టాప్ టీమ్స్‌కి కెప్టెన్లుగా వ్యవహరించి, ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నవాళ్లే. ఈ నలుగురిలో జో రూట్ గత రెండేళ్లలో ఏకంగా 12 సెంచరీలు బాది, కెరీర్ బెస్ట్ ఫామ్‌ని కొనసాగిస్తున్నాడు.

మిగిలిన ముగ్గురిలో స్టీవ్ స్మిత్ కూడా కాస్త లేటుగా అయినా ఫామ్‌లోకి రాగా కేన్ విలియమ్ సన్ రెండేళ్ల తర్వాత సెంచరీ సాధించాడు. అప్పుడెప్పుడో 2021 ఆరంభంలో పాకిస్తాన్‌పై సెంచరీ చేసిన కేన్ మామ తాజాగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో 132 పరుగులు చేసి కెరీర్‌లో 26వ టెస్టు సెంచరీని అందుకున్నాడు. 2021 జనవరిలో విరాట్ కోహ్లీ 27 టెస్టు సెంచరీలు చేసి ఫ్యాబ్ 4లో టాప్‌లో ఉండగా స్టీవ్ స్మిత్ 26, కేన్ విలియంసన్ 24, జో రూట్ 17 సెంచరీలతో ఉన్నారు. 2023 ఫిబ్రవరి వచ్చే సరికి స్టీవ్ స్మిత్ 30 సెంచరీలతో టాప్‌లోకి వెళ్లగా జో రూట్ 29 సెంచరీలతో రెండో స్థానానికి దూసుకొచ్చాడు.

కేన్ విలియమ్ సన్ 26 సెంచరీలతో మూడు నుంచి నాలుగో స్థానానికి పడిపోగా టాప్‌లో ఉన్న విరాట్ కోహ్లీ మూడేళ్లుగా ఒక్క సెంచరీ చేయలేక 27 సెంచరీలతో మూడో స్థానానికి దిగజారాడు. కోహ్లీ ఇంకా లేటు చేస్తే టాప్ 4కి పడిపోవడం కూడా ఖాయమే. రెండేళ్లుగా సెంచరీ చేయలేకపోయిన కేన్ విలియమ్ సన్ కూడా సెంచరీ కొట్టేయడంతో ఇక విరాట్ కోహ్లీ మాత్రమే మూడేళ్లుగా టెస్టు సెంచరీ చేయని ప్లేయర్‌గా మిగిలిపోయాడు.

వన్డేల్లో, టీ20ల్లో సెంచరీలు అందుకున్న విరాట్ కోహ్లీ టెస్టుల్లో మాత్రం ఆ మార్కును అందుకోలేకపోతున్నాడు. ప్రస్తుత తరంలో విరాట్ కోహ్లీ 74 అంతర్జాతీయ సెంచరీలతో టాప్‌లో ఉంటే జో రూట్, డేవిడ్ వార్నర్ 45 సెంచరీలతో రెండో స్థానంలో ఉన్నారు. రోహిత్ శర్మ 43 సెంచరీలతో స్టీవ్ స్మిత్ 42 సెంచరీలతో ఉన్నారు. కేన్ విలియంసన్ 39 సెంచరీలతో ఆరో స్థానంలో ఉన్నాడు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed