- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చిన్నప్పుడు ఎలా ఆడానో.. అలాగే ఆడా : గిల్
ఇంగ్లాండ్ గడ్డపై టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అదరగొడుతున్నాడు.

దిశ, స్పోర్ట్స్ : ఇంగ్లాండ్ గడ్డపై టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అదరగొడుతున్నాడు. తొలి టెస్టులో సెంచరీ చేసిన అతను రెండో టెస్టులో డబుల్ సెంచరీ బాదిన విషయం తెలిసిందే. కీలక సమయంలో క్రీజులో నిలబడిన అతను 269 రన్స్ చేశాడు. బీసీసీఐ టీవీతో గిల్ తన ఇన్నింగ్స్ గురించి మాట్లాడాడు. చిన్నతనంలో ఎలా బ్యాటింగ్ చేశానో, ఆ తరహాలోనే ఆడేందుకు ప్రయత్నించినట్టు చెప్పాడు. ఐపీఎల్ తర్వాత, ఈ సిరీస్‌కు ముందు తన టెక్నిక్‌పై ఫోకస్ పెట్టినట్టు తెలిపాడు. ‘ప్రధానంగా నా మూమెంట్స్‌పై పనిచేశా. ముందు నా బ్యాటింగ్‌గా బాగానే ఉంది. టెస్టుల్లో నిలకడగా 30, 35, 40 రన్స్ చేశా. కానీ, ఏదో ఒక సమయంలో నా ఏకాగ్రతను కోల్పోయేవాడిని. ఎక్కువగా ఫోకస్ చేస్తే కూడా నష్టపోతారని చాలా మంది చెప్పారు. అందుకే ఈ సిరీస్‌లో తన బేసిక్స్‌ను ఫాలో అవ్వాలనుకున్నానని తెలిపాడు.
‘చిన్ననాటి తరహాలో బ్యాటింగ్ చేయాలని భావించా. 35-40 రన్స్ లేదా భారీ ఇన్నింగ్స్ ఆడాలని ఆలోచించలేదు. నేను నా బ్యాటింగ్‌ను ఆస్వాదించాలనుకున్నానంతే.’అని చెప్పాడు. లోయర్ ఆర్డర్ ఎప్పుడైనా కుప్పకూలొచ్చనే విషయం తనకు అర్థమైందని, అందుకే తనకు వీలైనంత సేపు బ్యాటింగ్ చేయాలని భావించానని తెలిపాడు. బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వాలేదన్నాడు. టీ20ల నుంచి టెస్టు ఫార్మాట్‌కు ఆటను మార్చుకోవడం చాలా కష్టమని తెలిపాడు. ‘ప్రస్తుతం టీ20 ఆడే విధానంలో టెక్నిక్, సెటప్, మైండ్‌సెట్‌లో భారీ వ్యత్యాస్యం ఉంది. ముఖ్యంగా గత 4-5 ఏళ్లలో చాలా మారింది. టీ20ల నుంచి టీ20లకు మారడం సులభం. కానీ,టీ20ల నుంచి టెస్టులకు చాలా కష్టం. మనసును, శరీరాన్ని దానికి అనుగుణంగా అలవాటు చేసుకోవడం సవాల్‌తో కూడుకున్నది. అందుకే నేను ఐపీఎల్ సమయంలోనే టెస్టులకు సిద్ధమయ్యా. ’అని గిల్ చెప్పుకొచ్చాడు.






