WTC Final: ఇండియాపైనే ఆడతా.. లేదంటే ఆడను.. ట్రావిస్ హెడ్ పై ట్రోలింగ్

by velandi.Saikiran |

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025 ఫైనల్ మ్యాచ్ లో ( World Test Championship 2025 final match) ఆస్ట్రేలియా ( Australia) ఓటమ

WTC Final: ఇండియాపైనే ఆడతా.. లేదంటే ఆడను.. ట్రావిస్ హెడ్ పై ట్రోలింగ్
X

దిశ, వెబ్ డెస్క్ : వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025 ఫైనల్ మ్యాచ్ లో ( World Test Championship 2025 final match) ఆస్ట్రేలియా ( Australia) ఓటమి దశలో ఉంది. మరో 69 పరుగులు సౌత్ ఆఫ్రికా సాధిస్తే... దారుణమైన ఓటమిని ఆస్ట్రేలియా చవిచూడక తప్పదు. మరో రెండు రోజుల సమయం, 8 వికెట్లు చేతిలో ఉన్న సౌత్ ఆఫ్రికా ( South Africa) ఖచ్చితంగా ఆ 69 పరుగులు సాధించి ఛాంపియన్అ వుతుందని చెబుతున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలోనే ఆస్ట్రేలియా డేంజర్ ఆటగాడు ట్రావిస్ హెడ్ పై ( Travis Head) దారుణంగా ట్రోలింగ్ జరుగుతుంది.

ఇండియా మీద రెచ్చిపోయే ట్రావిస్ హెడ్... వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025 ఫైనల్ మ్యాచ్ లో ( WTC 2025) ఎందుకు ఆడడం లేదని.. సోషల్ మీడియాలో దారుణంగా కామెంట్లు పెడుతున్నారు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ లో రెండు ఇన్నింగ్స్ లో కలిపి 20 పరుగులు మాత్రమే సాధించాడు హెడ్. మొదటి ఇన్నింగ్స్ లో 13 బంతులు ఆడి 11 పరుగులు చేసిన హెడ్... రెండో ఇన్నింగ్స్ లో 18 బంతులు ఆడి 9 పరుగులు మాత్రమే చేశాడు.

దీంతో సోషల్ మీడియాలో అతన్ని ఏకీపారేస్తున్నారు. ఇండియా మీద ఆడే హెడ్... సఫారీల చేతిలో చిత్తుగా ఔట్ అయ్యాడని చురకలు అంటిస్తున్నారు. అంతేకాదు.. మీకు దమ్ముంటే WTC ఫైనల్ ను... టీమిండియాతో పెట్టండి అప్పుడు ఆడతానంటూ హెడ్ డిమాండ్ చేస్తున్నట్లు కూడా కొన్ని పోస్టులు పెడుతున్నారు. అందులో బ్రహ్మానందం ఫోటోలు, వీడియోలు పెట్టి మరి ట్రోల్ చేస్తున్నారు.

Next Story