సీఫర్ట్ సూపర్ ఇన్నింగ్స్.. ఓటమి లేని కివీస్!

by Phanindra |

సౌతాఫ్రికాతో జరిగిన టీ20 మ్యాచులో న్యూజిల్యాండ్ ఘనవిజయం సాధించింది. ఓపెనర్ టిమ్ సీఫర్ట్ సూపర్ ఇన్నింగ్స్‌తో కివీస్ వరుసగా మూడో గెలుపు తన ఖాతాలో వేసుకుంది.

సీఫర్ట్ సూపర్ ఇన్నింగ్స్.. ఓటమి లేని కివీస్!
X

దిశ, స్పోర్ట్స్: ముక్కోణపు టీ20 సిరీసులో న్యూజిల్యాండ్ వరుసగా మూడో విజయం సాధించింది. హరారే వేదికగా సౌతాఫ్రికాను చిత్తుగా ఓడించింది. కివీస్ ఓపెనర్ టిమ్ సీఫర్ట్ (66 నాటౌట్) అద్భుతంగా ఆడాడు. బౌలింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై పట్టుదలగా ఆడి జట్టును విజయతీరాలకు చేర్చాడు. 135 పరుగుల ఛేజ్‌లో డెవాన్ కాన్వే (19), రచిన్ రవీంద్ర (3), మార్క్ చాప్‌మన్ (10) త్వరగానే అవుటయ్యారు. అయితే సీఫర్ట్‌కు జతకలిసిన డారిల్ మిచెల్ (20 నాటౌట్) మరో వికెట్ పడనివ్వలేదు. దీంతో కేవలం 15.5 ఓవర్లలోనే టార్గెట్‌ను కివీస్ ఛేజ్ చేసింది.

సీఫర్ట్‌కే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 134/8 స్కోరుకే పరిమితమైంది. రీజా హెండ్రిక్స్ (41), జార్జ్ లిండె (23) మినహా ఎవరూ కనీసం 20 పరుగులు కూడా చేయలేకపోయారు. కివీస్ బౌలర్లలో జాకబ్ డఫ్ఫీ, ఆడమ్ మిల్నే, మిచెల్ శాంట్నర్ రెండేసి వికెట్లతో రాణించారు. పవర్‌ప్లేలో తాము అద్భుతంగా బౌలింగ్ చేశామని, స్వింగ్‌కు పిచ్ సహకరించడం తమకు బాగా కలిసొచ్చిందని కివీస్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ చెప్పాడు.

Next Story