- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, స్పోర్ట్స్ : ప్రతిష్టాత్మక బ్యాడ్మింటన్ టోర్నీ థామస్ కప్‌ను మరోసారి గెలవాలన్న భారత జట్టు ఆశ నెరవేరలేదు. సెమీస్‌లో ఓడిపోవడంతో టైటిల్ పోరుకు కూడా చేరుకోకుండానే ఇంటిదారిపట్టింది. దీంతో భారత్ కాంస్య పతకంతోనే సరిపెట్టింది. శనివారం జరిగిన సెమీస్‌లో ఫ్రాన్స్ చేతిలో 3-0 తేడాతో ఓటమిపాలైంది. ఐదు గేముల్లో తొలి మూడు గేముల్లో వరుసగా ఓడిపోవడంతో మ్యాచ్ ప్రత్యర్థి కైవసమైంది. ఆయుశ్ శెట్టి 11-21, 9-21తో పొపొవ్ చేతిలో మొదటి గేమును కోల్పోయాడు. అనంతరం కిదాంబి శ్రీకాంత్ 16-21, 18-21 తేడాతో అలెక్స్ లానియర్ చేతిలో, హెచ్‌ఎస్ ప్రణయ్ 19-21, 16-21 తేడాతో పొపొవ్ చేతిలో ఓడిపోవడంతో మరో రెండు డబుల్స్ గేములు మిగిలి ఉండగానే భారత్ ఓటమిని అంగీకరించింది. కానీ, కాంస్య పతకంతో ఇంటికి రానుంది. టోర్నీ చరిత్రలో భారత్‌కు ఇది 5వ మెడల్. 2022లో చాంపియన్‌గా నిలువగా.. 1952, 1955, 1979లలో బ్రాంజ్ మెడల్ గెలిచింది.






