బాగా ఆడకపోతే ఇలాగే జరుగుతుంది.. తొలి టెస్టు ఓటమిపై గంభీర్ కీలక వ్యాఖ్యలు

by Harish |

తొలి టెస్టులో ఓటమి అనంతరం టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ భారత బ్యాటర్లపై కీలక వ్యాఖ్యలు చేశాడు.

బాగా ఆడకపోతే ఇలాగే జరుగుతుంది.. తొలి టెస్టు ఓటమిపై గంభీర్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, స్పోర్ట్స్ : తొలి టెస్టులో ఓటమి అనంతరం టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ భారత బ్యాటర్లపై కీలక వ్యాఖ్యలు చేశాడు. బాగా ఆడకపోతే ఇలాగే జరుగుతుందన్నాడు. పిచ్ తాము కోరుకున్నదేనని చెబుతూ తమ బ్యాటర్లే సరిగ్గా ఆడలేదని వ్యాఖ్యానించాడు. ‘మేము ఇలాంటి పిచే అడిగాం. క్యూరెటర్ మాకు సహాయం చేశాడు. ఇక్కడ పాయింట్ పిచ్‌ గురించి కాదు. టర్న్ ఆడటం తెలిసి ఉండాలి. పిచ్ ఎలా ఉన్నా 124 పరుగులు ఛేదించగలిగేదే. డిఫెన్స్ ఆడితే కచ్చితంగా పరుగులు చేయొచ్చు. ఈ పిచ్‌పై బిగ్ షాట్స్ ఆడలేం. కానీ, డిఫెన్స్ ఆడగలిగితే మాత్రం కచ్చితంగా రన్స్ చేసే పిచ్. బవుమా హాఫ్ సెంచరీ చేశాడు. అక్షర్, సుందర్ కూడా పరుగులు రాబట్టారు. కాబట్టి ఎప్పుడూ పిచ్ గురించి మాట్లాడటం వల్ల ఉపయోగం లేదు’అని తెలిపాడు. పిచ్ స్పిన్నర్లకు సహకరించడంపై అడిగిన ప్రశ్నకు గంభీర్ స్పందిస్తూ.. పేసర్లే ఎక్కువ వికెట్ తీశారని చెప్పాడు. స్పిన్నర్లు, పేసర్లు ఇద్దరూ ప్రభావం చూపించారన్నాడు.

Next Story