టీమిండియా దారుణ ఓటమికి కారణాలు ఇవే.. అసలు విలన్ ఎవరంటే?

by velandi.Saikiran |

లీడ్స్ ( Leeds) వేదికగా జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా ( Team India) అత్యంత దారుణంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే.

టీమిండియా దారుణ ఓటమికి కారణాలు ఇవే.. అసలు విలన్ ఎవరంటే?
X

దిశ, వెబ్ డెస్క్: లీడ్స్ ( Leeds) వేదికగా జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా ( Team India) అత్యంత దారుణంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఎవరు ఊహించని విధంగా మ్యాచ్ ను చేజేతులా పోగొట్టుకుంది టీమిండియా. ఈ మ్యాచ్ లో ఐదు వికెట్ల తేడాతో దారుణంగా ఓడిపోయింది. ఈ తరుణంలోనే మొదటి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా ఓటమికి కారణమైన అంశాలపై సోషల్ మీడియాలో కొత్త చర్చ జరుగుతోంది.

అన్ని రంగాల్లో టీమిండియా విఫలం కావడంతో ఓటమిపాలైందని కొంతమంది అంటున్నారు. ఇందులో ముఖ్యమైన అంశాలు పరిశీలిస్తే... టీమిండియా లోయర్ ఆర్డర్. ఇంగ్లాండు లోయర్ ఆర్డర్ ఆటగాళ్లందరూ అద్భుతంగా ఆడారు. కానీ టీమిండియా టేలండర్స్... మాత్రం చెత్త ప్రదర్శన కనబరిచారు. ఈ మ్యాచ్ లో లోయర్ ఆర్డర్... కేవలం 70 పరుగులు చేసి... 13 వికెట్లు కోల్పోయింది. ముఖ్యంగా టీమిండియా ఫీల్డింగ్ అత్యంత దారుణంగా ఉంది.

ఈ టెస్ట్ మ్యాచ్ లో మొత్తం 6 క్యాచ్ లు వదిలేశారు. ఇందులో యశస్వి జైశ్వాల్ ఒక్కడే 4 క్యాచ్ లు వదిలేసాడు. అటు గిల్ తీసుకున్న రివ్యూ ఒక్కటి కూడా సక్సెస్ కాలేదు. అంటే కెప్టెన్సీలో గిల్ విఫలం అయ్యాడు అన్నమాట. ముఖ్యంగా బుమ్రా బౌలింగ్ గురించి మాట్లాడుకోవాలి. మొదటి ఇన్నింగ్స్ లో దుమ్ము లేపిన బుమ్రా.. రెండో ఇన్నింగ్స్ లో వికెట్లు తీయలేదు. ఈ దెబ్బకు టీమిండియా ఓడిపోవాల్సి వచ్చింది. టీమిండియా బౌలర్లు కూడా.. అందరూ రాణించి ఉంటే మ్యాచ్ గెలిచే వాళ్ళం. ఈ అంశాలపై దృష్టి పెట్టి రెండో టెస్ట్ కు టీమిండియా సిద్ధం అవుతూనే... సిరీస్ గెలవచ్చు అంటూ క్రీడా నిపుణులు సూచనలు చేస్తున్నారు. అటు గంభీర్ ప్రయోగాలు కూడా తగ్గించుకోవాలని అంటున్నారు.

Next Story