- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
WTC తర్వాత సౌతాఫ్రికా మరో బంపర్ విక్టరీ
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ గెలిచిన సౌత్ ఆఫ్రికా.. తన దూకుడు కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలోనే మరో భారీ విజయాన్న

దిశ, వెబ్ డెస్క్: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ (World Test Championship final 2025) గెలిచిన సౌత్ ఆఫ్రికా.. తన దూకుడు కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలోనే మరో భారీ విజయాన్ని నమోదు చేసుకుంది దక్షిణాఫ్రికా. జింబాబ్వే వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య తాజాగా మొదటి టెస్ట్ జరిగింది. క్వీన్ స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరిగిన ఈ మొదటి టెస్ట్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా అదరగొట్టింది. ఈ మ్యాచ్ లో జింబాబ్వేను చిత్తు చేసి.. ఏకంగా 328 పరుగుల తేడాతో విజయం సాధించింది దక్షిణాఫ్రికా.
ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 418 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. ఆ తర్వాత జింబాబ్వే మొదటి ఇన్నింగ్స్ 251కి ముగిసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ లో దక్షిణాఫ్రికా ప్లేయర్లు అద్భుతంగా రాణించి 369 పరుగులు చేశారు. అటు ఈ లక్ష్యాన్ని జింబాబ్వే చేదించలేక 208 పరుగులకే రెండో ఇన్నింగ్స్ లో ఆల్ అవుట్ అయింది. ఈ నేపథ్యంలో 328 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది దక్షిణాఫ్రికా. ఈ మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన ప్రిటోరియస్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చింది. కాగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ గెలిచిన సౌత్ ఆఫ్రికా..ఇప్పుడు ఈ విజయాన్ని నమోదు చేసుకుంది.






