సూర్యుడు మళ్లీ ఉదయిస్తాడు.. వన్డే వరల్డ్ కప్ లో కీలకపాత్ర పోషిస్తాడు: యువరాజ్ సింగ్

by Kema Shiva Kumar |   (  Updated:2023-03-25 03:45:44  IST  )

ఇటీవల ఆస్ట్రేలియాతో ముగిసిన మూడు వన్డేల సిరీస్‌లో దారుణంగా విఫలమైన టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌కు మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ బాసటగా నిలిచాడు.

సూర్యుడు మళ్లీ ఉదయిస్తాడు.. వన్డే వరల్డ్ కప్ లో కీలకపాత్ర పోషిస్తాడు: యువరాజ్ సింగ్
X

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల ఆస్ట్రేలియాతో ముగిసిన మూడు వన్డేల సిరీస్‌లో దారుణంగా విఫలమైన టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌కు మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ బాసటగా నిలిచాడు. సూర్యకుమార్ యాదవ్ మళ్లీ ఫామ్ ను అందిపుచ్చుకుంటాడని, గతంలో మాదిరి చెలరేగుతాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. అదేవిధంగా ఈ ఏడాది భారత్ వేదికగా జరగబోయే వన్డే ప్రపంచకప్‌లో అదను కీలకపాత్ర పోషించనున్నాడని యువరాజ్ సింగ్ ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు.

ప్రతీ ఆటలో ప్రతి ఆటగాడు ఎప్పుడో ఒకప్పుడు ఒడిదొడుకులను ఎదుర్కోవడం సర్వసాధారణమని పేర్కొన్నాడు. ఒకానొక దశలో తాను కూడా అలాంటి గడ్డు పరిస్థితులను ఎదుర్కున్నట్లు అతను తెలిపాడు. రాబోయే వన్డే ప్రపంచకప్‌లో సూర్య కీలక పాత్ర పోషిస్తాడనే నమ్మకం తనకుందని అన్నాడు. అందరం టీమిండియాకు మద్దతుగా నిలుద్దామని.. సూర్య మళ్లీ తన ఆటతో ఉదయిస్తాడని యువరాజ్ ట్వీట్ చేశాడు.

Next Story