టీమిండియా వర్సెస్ శ్రీలంక సిరీస్ పై కీలక ప్రకటన... మరో 3 రోజుల్లోనే!

by velandi.Saikiran |

టీమిండియా ప్రస్తుతం ఇంగ్లాండ్ లో టెస్ట్ సిరీస్ ఆడుతున్న సంగతి తెలిసిందే. అయితే... ఈ టెస్టు సిరీస్ ముగియగానే వైట్ బాల్

టీమిండియా వర్సెస్ శ్రీలంక సిరీస్ పై కీలక ప్రకటన... మరో 3 రోజుల్లోనే!
X

దిశ, వెబ్ డెస్క్ : టీమిండియా ప్రస్తుతం ఇంగ్లాండ్ లో టెస్ట్ సిరీస్ ఆడుతున్న సంగతి తెలిసిందే. అయితే... ఈ టెస్టు సిరీస్ ముగియగానే వైట్ బాల్ క్రికెట్ ఆడనుందని తెలుస్తోంది. టీమిండియా వర్సెస్ శ్రీలంక జట్ల మధ్య వచ్చే నెలలో వన్డే సిరీస్ ప్రారంభం కానున్నట్లు సమాచారం అందుతుంది. ఈ మేరకు ఇప్పటికే భారత క్రికెట్ నియంత్రణ మండలి అలాగే శ్రీలంక క్రికెట్ బోర్డు మధ్య చర్చలు జరిగాయట.

ఆగస్టులో శ్రీలంక లోనే ఈ వన్డే సిరీస్ నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారట. దీనికి తాజాగా శ్రీలంక క్రికెట్ బోర్డు కూడా అంగీకారం తెలిపినట్లు సమాచారం అందుతోంది. మరో రెండు లేదా మూడు రోజుల్లోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. నిజంగానే ఈ ప్రకటన వస్తే ఆగస్టులో టీమిండియా వర్సెస్ శ్రీలంక మధ్య వన్డే సిరీస్ ప్రారంభం కానుంది.

వన్డే సిరీస్ జరిగితే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మళ్ళీ జట్టులోకి వస్తాడు. అటు విరాట్ కోహ్లీ కూడా జట్టులో చేరాల్సి ఉంటుంది. కాగా విరాట్ కోహ్లీ అలాగే రోహిత్ శర్మ ఇద్దరూ కూడా టెస్టులు, టి20 లకు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఇద్దరు స్టార్ ప్లేయర్లు కేవలం వన్డేల్లో మాత్రమే ఆడుతున్నారు.

Next Story