డిసెంబర్ వరకు సమయం ఉంది : ధోనీ

by Harish |

ఐపీఎల్-2026‌లో పాల్గొనడంపై నిర్ణయం తీసుకోవడానికి డిసెంబర్ వరకు సమయం ఉందని ధోనీ తెలిపాడు.

డిసెంబర్ వరకు సమయం ఉంది : ధోనీ
X

దిశ, స్పోర్ట్స్ : భారత మాజీ క్రికెటర్, చెన్నయ్ సూపర్ కింగ్స్(సీఎస్కే) దిగ్గజ ప్లేయర్ ఎం.ఎస్ ధోనీ ఏ ఈవెంట్‌కు వెళ్లినా ఒక్కటే ప్రశ్న. వచ్చే ఐపీఎల్ సీజన్ ఆడటం గురించే. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ధోనీకి మళ్లి అదే ప్రశ్న ఎదురైంది. దానికి ధోనీ బదులిస్తూ.. డిసెంబర్‌ వరకు సమయం ఉందన్నాడు. ‘నేను ఆడతానో లేదో తెలియదు. నిర్ణయం తీసుకోవడానికి సమయం ఉంది. డిసెంబర్‌లో వరకు టైం ఉంది. కాబట్టి, నిర్ణయం తీసుకోవడానికి రెండు నెలలు ఉంది. ఆ తర్వాతే నా డెసిషన్‌ను తీసుకుంటాను.’అని చెప్పాడు. అప్పడు మరో అభిమాని ‘ధోనీ సర్ మీరు ఆడాలి’అని అడగ్గా.. ధోనీ స్పందిస్తూ..‘నేను మోకాలి నొప్పితో బాధపడుతున్నా. నా గాయాన్ని ఎవరూ చూసుకుంటారు.’అని బదులివ్వడంతో అందరూ నవ్వారు. 44 ఏళ్ల ధోనీ గత రెండేళ్లుగా మోకాలి గాయంతో బాధపడుతున్నాడు. గత రెండు సీజన్లలోనూ అతను లోయర్ ఆర్డర్‌లోనే బ్యాటింగ్‌కు దిగాడు. ఈ క్రమంలోనే వచ్చే సీజన్‌లో ధోనీ బరిలోకి దిగడంపై అనుమానాలు నెలకొన్నాయి.


Next Story