iQOO నుంచి క్రేజీ ఫోన్ వ‌చ్చేస్తోంది..7000 బ్యాట‌రీ,ధ‌ర‌, ఫీచ‌ర్స్ ఇవే

by velandi.Saikiran |   (  Updated:2025-10-28 08:08:06  IST  )

iQOO 15 మొబైల్ ఫీచర్స్ ఒకసారి పరిశీలిస్తే, 6.85 ఇంచుల డిస్ప్లే కలిగి ఉంటుంది. ఈ మొబైల్ ఫోన్ స్నాప్ డ్రాగన్ 8 ఎలిట్ జెన

iQOO నుంచి క్రేజీ ఫోన్ వ‌చ్చేస్తోంది..7000 బ్యాట‌రీ,ధ‌ర‌, ఫీచ‌ర్స్ ఇవే
X

దిశ‌, వెబ్ డెస్క్‌: ఇండియన్ మార్కెట్లో ఐక్యూ మొబైల్ కంపెనీకి ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఈ కంపెనీ నుంచి వచ్చిన మొబైల్స్ కు మార్కెట్లో మంచి క్రేజ్ ఉంటుంది. అయితే ఇలాంటి నేపథ్యంలో ఐక్యూ కంపెనీ తాజాగా కీలక ప్రకటన చేసింది. ఐక్యూ 15 ( iQOO 15 ) మోడల్ మొబైల్ ఫోన్ ను వచ్చే నెలలో లాంచ్ చేయబోతున్నట్లు ప్రకటన చేసింది కంపెనీ. నవంబర్ 26వ తేదీన ఈ మొబైల్ ను తీసుకు వస్తున్నట్లు వెల్లడించింది. అయితే ఈ iQOO 15 మొబైల్ ధర ఇంకా ఫైనల్ కాలేదు. దాదాపు 50 వేల వరకు ఉంటుందని చెబుతున్నారు.

వచ్చే నెలలో రిలీజ్ కాబోతున్న ఈ iQOO 15 మొబైల్ ఫీచర్స్ ఒకసారి పరిశీలిస్తే, 6.85 ఇంచుల డిస్ప్లే కలిగి ఉంటుంది. ఈ మొబైల్ ఫోన్ స్నాప్ డ్రాగన్ 8 ఎలిట్ జెన్ 5 ప్రాసెసర్ కలిగి ఉంటుంది. ఇక సెల్ఫీల కోసం 32 ఎంపీ కెమెరా అందిస్తున్నారు. బ్యాక్ కెమెరా 50 ఎంపీ ఉంటుంది. 12 జీబీ ర్యామ్ + 256 జిబి స్టోరేజ్ తో తీసుకు వస్తున్నారట. ఇక ఈ మొబైల్ బ్యాటరీ సామర్థ్యం 7000 mah ఉంటుందని సమాచారం అందుతోంది. ఆల్రెడీ 16 వెర్షన్ పై iQOO 15 మొబైల్ రన్ చేస్తుంది.

Next Story