- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఐపీఎల్ 2025 రోజుల గడువు పెంపు... ఫైనల్ మ్యాచ్ ఎప్పుడు అంటే?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ (IPL 2025) పునః ప్రారంభం పై క్లారిటీ వచ్చింది. ఈ టోర్నమెంట్ మరో ఐదు రోజుల్లోనే

దిశ, వెబ్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ (IPL 2025) పునః ప్రారంభం పై క్లారిటీ వచ్చింది. ఈ టోర్నమెంట్ మరో ఐదు రోజుల్లోనే ప్రారంభం కానున్నట్లు సోషల్ మీడియాలో వార్త వైరల్ అవుతుంది. అంటే మే 16వ తేదీ నుంచి.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ పునః ప్రారంభమవుతుందని తెలుస్తోంది. మే 16న ప్రారంభం కానున్న ఈ టోర్నమెంట్ మే 30వ తేదీ వరకు జరగనున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి.
పాత షెడ్యూల్ ప్రకారం మే 25వ తేదీన.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ముగియాలి. కానీ ఐపీఎల్ నిరవధిక వాయిదా పడిన నేపథ్యంలో.. రోజుల గడువును పెంచేందుకు సిద్ధమయ్యారు. ఐపీఎల్ 2025 టోర్నమెంట్ మే 30 వరకు కొనసాగుతుంది అన్నమాట. అంటే మే 30వ తేదీన ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. అలాగే బెంగుళూరు (Bengulru), చెన్నై ( Chennai) అలాగే హైదరాబాద్ ( Hyderabad) వేదికలలో మిగిలిన అన్ని మ్యాచ్ లు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. మంగళవారం రోజున అన్ని ఫ్రాంచైజీలతో సమావేశం కూడా ఉండనుంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.






