- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కోహ్లీ, AB డివిలియర్స్ మధ్య గొడవలు.. కారణం ఇదే ?
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మాజీ కెప్టెన్, టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ( Virat Kohli) అలాగే బెంగళూరు మాజీ

దిశ, వెబ్ డెస్క్: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మాజీ కెప్టెన్, టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ( Virat Kohli) అలాగే బెంగళూరు మాజీ ఆటగాడు ఏబి డివిలియర్స్ ( AB de Villiers) మధ్య గొడవలు ఉన్నట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. గతంలో కోహ్లీ అలాగే డివిలియర్స్ మధ్య గొడవలు జరిగాయట. ఈ విషయాన్ని స్వయంగా ఏబి డివిలియర్స్.. వెల్లడించడం గమనార్హం.
2024 సంవత్సరంలో ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య టెస్ట్ సిరీస్ జరిగిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో విరాట్ కోహ్లీ.... బుంగమూతి పెట్టుకున్నాడట. AB డివిలియర్స్ తో... ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య టెస్ట్ సిరీస్ తర్వాత.. ఒక్క మాట కూడా మాట్లాడలేదట. ఆ సమయంలో తాను ఎంతో బాధపడ్డాను అని AB డివిలియర్స్ స్వయంగా పేర్కొన్నారు.
అయితే కోహ్లీ భార్య అనుష్క శర్మ గర్భంతో ఉన్నారని.. రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నారని తాను మీడియాతో చెప్పడమే అందుకు కారణమని... ఏబీ డివిలియర్స్ చెప్పుకొచ్చాడు. అయితే కొంతకాలంగా కోహ్లీ తనతో మాట్లాడుతున్నట్లు కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు AB డివిలియర్స్. మొన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు 18 సంవత్సరాల తర్వాత టైటిల్ గెలిచిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో విరాట్ కోహ్లీ అలాగే ఎబి డివిలియర్స్ ఇద్దరు కలిసి గ్రౌండ్లోనే సెలబ్రేషన్స్ చేసుకున్నారు. దాంతో ఇద్దరు కలిసి పోయినట్లే అని... ఇప్పుడు ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.






