- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇంగ్లాండ్ పై నిప్పులు చెరిగిన స్టార్క్.. కుప్పకూలిన ఇంగ్లీష్ జట్టు
ప్రపంచ క్రికెట్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన టెస్ట్ సిరీస్ లలో ద యాషెస్ ఒకటిగా నిలిచింది. ఇది ఆస్ట్రేలియా- ఇంగ్లాండ్ జట్ల మధ్య ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది.

దిశ, వెబ్ డెస్క్: ప్రపంచ క్రికెట్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన టెస్ట్ సిరీస్ లలో ద యాషెస్ టెస్ట్ (Ashes Test) ఒకటిగా నిలిచింది. ఇది ఆస్ట్రేలియా- ఇంగ్లాండ్ జట్ల మధ్య ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. 1882లో ఇంగ్లాండ్ ఓటమి తర్వాత "English cricket has died" అనే వ్యంగ్య వ్యాఖ్యతో ప్రారంభమైన ఈ సిరీస్, అప్పటి నుంచి క్రికెట్ ప్రతిష్ఠను, గర్వాన్ని ప్రతినిధ్యం చేస్తూ వస్తోంది. ‘Ashes’ అనే చిన్న టెరాకోటా అర్ణ్ ఈ సిరీస్‌కు ప్రతీకగా నిలుస్తుంది. ఇప్పటి వరకు మొత్తం 73 సిరీస్‌లు జరిగాయి, వీటిలో ఆస్ట్రేలియా 34, ఇంగ్లాండ్ 32 సార్లు విజయం సాధించాయి. కాగా 74వ Ashes టెస్ట్ ఈ రోజు ప్రారంభం కాగా.. ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ మిచెల్ స్టార్.. ఇంగ్లాండ్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు.
స్టార్క్ మెరుపు బంతులను ఆడలేకపోయిన ఇంగ్లీష్ బ్యాటర్లు ఒక్కొక్కరిగా డ్రెస్సింగ్ రూమ్ చేరుకున్నారు. ఈ మ్యాచులో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఎంచుకోగా.. ఓలీ పోప్ 46, హారీ బ్రూక్ 52, జెమి స్మిత్ 33, డకెట్ 21 మినహా ఏ ఒక్క బ్యాటర్ డబుల్ దిజిట్ కూడా చేయలేక పోయారు. ముఖ్యంగా స్టార్ ఒక్కడే ఏడు వికెట్లు పడగొట్టడంతో ఇంగ్లాండ్ జట్టు 32. 5 ఓవర్లకు 172 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ మ్యాచులో Brendan Doggett 2, గ్రీన్ 1 వికెట్ పడగొట్టాడు. తక్కువ పరుగులకే ఆలౌట్ అయిన ఇంగ్లాండ్ జట్టు.. ఆస్ట్రేలియాకు అదే రేంజ్ లో చుక్కలు చూపిస్తున్నారు. ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్ ప్రారంభమై 4.1 ఓవర్లు అయినప్పటికి ఒక్క పరుగు చేయకుండానే ఒక వికెట్ కోల్పోయింది. మరి ఈ రసవత్తరమైన మ్యాచ్ ఎలా ముందుకు సాగుతుందో తెలియాలంటే వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది.






