రూట్ తో గొడవ... టీమిండియా ఫాస్ట్ బౌలర్ సంచలన వ్యాఖ్యలు!

by velandi.Saikiran |

టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఐదవ టెస్ట్ లో... ప్లేయర్ల మధ్య గొడవలు జరుగుతున్నాయి. అలాగే అంపైర్ ధర్మసేన

రూట్ తో గొడవ... టీమిండియా ఫాస్ట్ బౌలర్ సంచలన వ్యాఖ్యలు!
X

దిశ, వెబ్ డెస్క్ : టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఐదవ టెస్ట్ లో... ప్లేయర్ల మధ్య గొడవలు జరుగుతున్నాయి. అలాగే అంపైర్ ధర్మసేన తో కూడా టీమిండియా ప్లేయర్లు గొడవ పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఇంగ్లాండ్ స్టార్ ఆటగాడు రూట్, ప్రసిద్ద్ కృష్ణ మధ్య కూడా చిన్నపాటి గొడవ జరిగింది. అయితే ఈ సంఘటనపై తాజాగా... టీమిండియా ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ద్ కృష్ణ స్పందించారు.

మ్యాచ్ లో చిన్నపాటి గొడవ జరిగిన విషయం వాస్తవమేనని.. స్పష్టం చేశారు ప్రసిద్ద్. ఇదంతా ఆటలో భాగమేనని వివరించారు. రూట్ అలాగే తాను.. ఇద్దరం ఆ పరిస్థితిని ఆస్వాదించినట్లు వెల్లడించారు. మ్యాచ్ తర్వాత కలిసి మెలిసి.. ఉండాల్సిందేనని చెప్పుకొచ్చారు ప్రసిద్ద్.

రూట్... చాలా గొప్ప ప్లేయర్. అతను ఎప్పుడూ కూడా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకే ఎప్పుడు ప్రయత్నిస్తాడని వెల్లడించాడు ప్రసిద్ద్. అలాంటి ప్లేయర్ తో కలిసి ఆడటం అద్భుతమైన అనుభవం అని చెప్పుకొచ్చాడు. అలాగే తన బౌలింగ్ రిథమ్ పైన కూడా స్పందించాడు. ఐదవ టెస్టులో తన బౌలింగ్ మెరుగుపడిందని.. ఇంకా కష్టపడతానని చెప్పుకొచ్చాడు.

Next Story