Ind vs Eng: 4-1 తేడాతో టీమిండియా దారుణంగా ఓడిపోవడం గ్యారెంటీ!

by velandi.Saikiran |

ఇండియా ( Team India) వర్సెస్ ఇంగ్లాండ్ (England) మధ్య మరో రెండు రోజుల్లోనే ఐదు టెస్టుల సిరీస్ (Five Test Series ) ప్రారం

Ind vs Eng:  4-1 తేడాతో టీమిండియా దారుణంగా ఓడిపోవడం గ్యారెంటీ!
X

దిశ, వెబ్ డెస్క్: ఇండియా ( Team India) వర్సెస్ ఇంగ్లాండ్ (England) మధ్య మరో రెండు రోజుల్లోనే ఐదు టెస్టుల సిరీస్ (Five Test Series ) ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నెల 20వ తేదీ నుంచి లీడ్స్ ( Leeds) వేదికగా మొదటి టెస్ట్ ప్రారంభం అవుతుంది. రోహిత్ శర్మ ( Rohit Sharma), కింగ్ కోహ్లీ (Kohli ), లాంటి బడా ప్లేయర్లు లేకుండానే ఇంగ్లాండ్ వెళ్ళింది టీం ఇండియా. గిల్ కెప్టెన్సీలో.. 5 టెస్టులు ఆడబోతోంది టీమిండియా.

దీంతో టీమిండియా.. ఇంగ్లాండ్ గడ్డపై గెలుస్తుందా..? లేదా అనేది మిలియన్ డాలర్ క్వశ్చన్. బౌలింగ్, బ్యాటింగ్ అటు ఫీల్డింగ్ అన్ని విభాగాల్లో రాణిస్తేనే గిల్ సేన గ్రాండ్ విక్టరీ కొడుతుంది. లేకపోతే దారుణ ఓటమి ఖాయం. అయితే ఇలాంటి నేపథ్యంలో... సీనియర్ క్రికెటర్ గ్రేమ్ స్వాన్ ( Graeme Swann) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇండియాపై ఇంగ్లాండ్ కచ్చితంగా టెస్ట్ సిరీస్ గెలుస్తుందని ఆయన వెల్లడించారు.

4-1 తేడాతో ఇండియాను చిత్తు చేయడం గ్యారెంటీ అని స్టేట్మెంట్ ఇచ్చారు. లేదా 3-2 తేడాతో టీమిండియా ఓడిపోవడం... గ్యారెంటీ అన్నారు. ఇండియా తో టెస్ట్ సిరీస్... ఇంగ్లాండ్ కు వామాప్ మ్యాచ్ లాంటిది అని గ్రేమ్ స్వాన్ వెల్లడించారు. యాషిస్ సిరీస్ కోసం... ఇంగ్లాండ్ ఇప్పుడే ప్రాక్టీస్ చేసుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు.

Next Story