నటుణ్ని పెళ్లి చేసుకున్న టెన్నిస్ స్టార్ వీనస్ విలియమ్స్

by Muthe.Rajitha |

టెన్నిస్ లెజెండ్ వీనస్ విలియమ్స్ వివాహం చేసుకున్నారు.

నటుణ్ని పెళ్లి చేసుకున్న టెన్నిస్ స్టార్ వీనస్ విలియమ్స్
X

దిశ, వెబ్ డెస్క్ : టెన్నిస్ లెజెండ్ వీనస్ విలియమ్స్ వివాహం చేసుకున్నారు. ఇటలీ మూలాలు కలిగిన నటుడు, మోడల్, నిర్మాత ఆండ్రియా ప్రెటిని డిసెంబర్ 19న పెళ్లాడారు. 2024లో పరిచయం అయిన వీరిద్దరూ అనంతరం ప్రేమలో పడి, 2025 జనవరి 31న ఇటలీలోని టస్కనీలో నిశ్చితార్థం జరుపుకున్నారు. సెప్టెంబర్ 2025లో ఇటలీలోని ఇస్చియా ద్వీపంలో కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో తొలి పెళ్లి వేడుకను నిర్వహించగా.. డిసెంబర్ 2025లో ఫ్లోరిడాలోని పామ్ బీచ్‌లో ఐదు రోజుల పాటు బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషుల సమక్షంలో ఘనంగా మరోసారి పెళ్లి చేసుకున్నారు.

డెన్మార్క్‌లో జన్మించి ఇటలీలో పెరిగిన 37 ఏళ్ల ఆండ్రియా ప్రెటి మోడలింగ్ నుంచి నటన, నిర్మాణ రంగాల్లో స్థిరపడగా, 45 ఏళ్ల టెన్నిస్ స్టార్ వీనస్ విలియమ్స్‌కు జీవితంలో ఈ వేడుక ఒక మైలురాయిగా నిలిచింది. పెళ్లి ఫోటోలను ఈ జంట సోషల్ మీడియాలో పంచుకోవడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Next Story