సౌతాఫ్రికా టెస్ట్ కెప్టెన్ గా టెంబా బవుమా

by Disha Web Desk 1 |
సౌతాఫ్రికా టెస్ట్ కెప్టెన్ గా టెంబా బవుమా
X

దిశ, వెబ్ డెస్క్: దక్షిణాఫ్రికా టెస్ట్ కెప్టెన్ గా టెంబా బవుమా పగ్గాలను అందుకున్నాడు. వరుస పరాజయాల నేపథ్యంలో దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు టెస్ట్ కెప్టెన్సీ నుంచి డీన్ ఎల్గర్ ను తప్పించింది. అయితే, ఇప్పటికే టీ20, వన్డే కెప్టెన్ గా ఉన్న బవుమా పొట్టి ఫార్మాట్ నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకోనున్నాడు. కేవలం టెస్టులు, వన్డేలకు మాత్రమే నాయకుడిగా వ్యవహరించనున్నాడు.

తొలి నల్ల జాతీయుడిగా రికార్డ్

సఫారీ జట్టు టెస్ట్ కెప్టెన్సీ దక్కించుకున్న టెంబా బవుమా కొత్త రికార్డును సృష్టించాడు. రెడ్ బాల్ క్రికెట్లో దక్షిణాఫ్రికాకు నాయకత్వం వహించనున్న తొలి నల్ల జాతీయుడిగా బవుమా నిలిచాడు. అలాగే సౌతాఫ్రికా టీ20 కెప్టెన్ గా అయిడెన్ మార్ క్రమ్ ఎంపికయ్యే అవకాశం ఉంది. ఇక ఎల్గర్‌ ఇప్పటివరకు 17 టెస్టుల్లో జట్టుకు నాయకత్వం వహించాడు. అందులో 9 విజయాలు, 7 ఓటములు, ఒక ​డ్రా ఉన్నాయి.

వరుస పరాజయాలతోనే...

విజయాలు ఎక్కువగా ఉన్నప్పటికీ ఇటీవల ఇంగ్లండ్, ఆస్ట్రేలియా సిరీస్ లలో దక్షిణాఫ్రికా ఓటమి పాలవటంతో సఫారీ సెలక్టర్లు కెప్టెన్ గా అతనిపై వేటు వేశారు. ఈ సిరీస్ లలో బ్యాటర్ గా, కెప్టెన్ గా ఎల్గర్ విఫలమయ్యాడు. అందుకే స్వదేశంలో వెస్టిండీస్ తో జరిగే టెస్ట్ సిరీస్ కు జట్టును ప్రకటించిన సెలక్షన్ కమిటీ బవుమాను కెప్టెన్ గా ఎంపిక చేసింది. అయితే, డీన్ ఎల్గర్ ఆటగాడిగా జట్టులో కొనసాగనున్నాడు. ఫిబ్రవరి 28 నుంచి సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికా- వెస్టిండీస్ మధ్య తొలి టెస్ట్ ప్రారంభం కానుంది.

Also Read..

రసవత్తరంగా రెండో టెస్ట్.

Next Story

Most Viewed