- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణలో 24 గంటల స్పోర్ట్స్ హాకథాన్.. ప్రపంచంలోనే మొదటిసారి
తెలంగాణలో 24 గంటల స్పోర్ట్స్ హాకథాన్ జరగనుంది. ఇది ప్రపంచంలోనే మొదటిసారి అని నిర్వాహకులు తెలిపారు.

దిశ, స్పోర్ట్స్/తెలంగాణ బ్యూరో: ప్రపంచంలోనే మొట్టమొదటి 24 గంటల నిరంతర స్టేడియం స్థాయి స్పోర్ట్స్ హాకథాన్‌ను హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన అధికారిక లోగో, పోస్టర్‌ను క్రీడా, యువజన సేవల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి గురువారం నాడు ఆవిష్కరించారు. మార్చి 28, 29 తేదీలలో హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో ఈ క్రీడా వేడుకను నిర్వహించనున్నారు. ఈ వినూత్న కార్యక్రమం క్రీడలు, సాంకేతిక ఆవిష్కరణలను ఒకే వేదికపై సమన్వయం చేసే ప్రపంచ ప్రథమ ప్రయత్నంగా నిలువనుంది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ స్పోర్ట్స్ హాకథాన్‌లో తాను స్వయంగా రెండు రోజులపాటు పాల్గొంటానని ప్రకటించారు.
రాష్ట్ర యువతను ప్రోత్సహించడం, క్రీడా రంగాన్ని బలోపేతం చేయడం, తెలంగాణను క్రీడా ఆవిష్కరణల కేంద్రంగా నిలబెట్టడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని చెప్పారు. ఈ స్పోర్ట్స్ హాకథాన్‌లో రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి యువత, క్రీడాకారులు, విద్యార్థులు, టెక్నాలజీ నిపుణులు, స్టార్టప్‌లు పాల్గొంటారని తెలిపారు. ఒకే స్టేడియంలో సుమారు 10వేల మంది పాల్గొనే ఈ మహత్తర కార్యక్రమం గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించేందుకు కూడా ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ హాకథాన్ బ్రాండ్ యజమాని సుందీప్ కుమార్ మక్తాల తదితరులు పాల్గొన్నారు.






