Team India ఓటమి.. Dinesh Karthik ఏమన్నాడంటే?

by Sathputhe Rajesh |   (  Updated:2022-12-05 06:34:37  IST  )

బంగ్లాదేశ్ తో తొలి వన్డేలో టీమిండియా ఓటమిపై దినేష్ కార్తిక్ స్పందించారు.

Team India ఓటమి.. Dinesh Karthik ఏమన్నాడంటే?
X

దిశ, వెబ్ డెస్క్: బంగ్లాదేశ్ తో తొలి వన్డేలో టీమిండియా ఓటమిపై దినేష్ కార్తిక్ స్పందించారు. దారుణమైన ఫీల్డింగ్ మ్యాచ్ స్వరూపాన్ని మార్చిందన్నారు. వాషింగ్టన్ సుందర్ కనీసం క్యాచ్ పట్టే్ందుకు ప్రయత్నించకపోవడం ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. కేఎల్ రాహుల్ క్యాచ్ ను వదిలేశాడు. కానీ సుందర్ బంతిని క్యాచ్ పట్టేందుకు ఎందుకు ముందుకు రాలేదో అర్థం కాలేదన్నాడు. అక్కడున్న లైటింగ్ కారణంగా బంతిని చూడలేకపోయాడా అన్నాడు.

ఒక వేళ బంతిని చూసి వుంటే కనీసం ముందుకు కదిలి క్యాచ్ పట్టాలి కదా అన్ని ప్రశ్నించాడు. టీమిండియా ఫీల్డింగ్ మెప్పించడంలో విఫలమయిందన్నాడు. మ్యాచ్ గొప్పగా ఆడలేదని, చెత్తగానూ ఆడలేదని తెలిపాడు. చివరి ఓవర్‌లో బౌండరీలను ఒత్తిడి కారణంగా వదిలేసి ఉండవచ్చన్నాడు. ఈ మ్యాచ్ లో ఫీల్డర్ వైఫల్యం రోహిత్ శర్మకు సైతం కోపం తెప్పించింది. కాగా ఆదివారం జరిగిన ఇండియా బంగ్లాదేశ్ మ్యాచ్ లో భారత్ మొదట బ్యాటింగ్ చేసి 9 వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ ను 136/9 పరిమితం చేసినా ఒక్క వికెట్ తీయలేక ఓటమి చవిచూసిన విషయం తెలిసిందే.


Also Read......

2022 FIFA: Senegal పై 3-0 తేడాతో England విజయం..

Next Story