T20 World Cup 2026: చితక్కొట్టిన టీమిండియా.. జింబాబ్వే ఎదుట కొండంత లక్ష్యం

by Gantepaka Srikanth |   (  Updated:2026-02-26 15:17:44  IST  )

సూపర్-8 తొలి మ్యాచ్‌లో తడబడి ఓటమిని చవిచూసిన టీమిండియా.. సెకండ్ మ్యాచ్‌లో సూపర్ కంబ్యాక్ ఇచ్చింది.

T20 World Cup 2026: చితక్కొట్టిన టీమిండియా.. జింబాబ్వే ఎదుట కొండంత లక్ష్యం
X

దిశ, వెబ్‌డెస్క్: సూపర్-8 తొలి మ్యాచ్‌లో తడబడి ఓటమిని చవిచూసిన టీమిండియా.. సెకండ్ మ్యాచ్‌లో సూపర్ కంబ్యాక్ ఇచ్చింది. గురువారం చెన్నైలోని చిదంబరం మైదానం వేదికగా జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో భారత బ్యాటర్లు అదరగొట్టారు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. వచ్చినోళ్లు వచ్చినట్లు చితక్కొట్టారు. మొత్తంగా 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయిన టీమిండియా 256 పరుగులు చేసింది. సంజు శాంసన్ (24), అభిషేక్ శర్మ (55), ఇషాన్ కిషన్ (38), సూర్యకుమార్ యాదవ్ (33), హార్దిక్ పాండ్యా (50), తిలక్ వర్మ (44) పరుగుల చేశారు. జింబాబ్వే బౌలర్లలో రిచార్డ్, బ్లెస్సింగ్, మోపాసా, సికిందర్ రజా తలో వికెట్ తీశారు. జింబాబ్వే విజయం సాధించాలంటే 257 పరుగులు చేయాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లో ఓడిన జట్టు ఇంటిబాట పట్టనుంది.

టీమిండియా: అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబె, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా.

జింబాబ్వే: మరుమణి, బెనెట్, డియోన్ మైర్స్, ర్యాన్ బర్ల్, సికిందర్ రజా, మున్‌యోంగా, ముసేకివా, బ్రాడ్ ఏవన్స్, మపోసా, రిచర్డ్ గరావా, ముజరబని.

Next Story