సెంచరీతో చెలరేగిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్.. వన్డే సిరీసూ మనదే..

by Phanindra |

ఇంగ్లండ్‌తో వన్డే సిరీసును భారత మహిళల టీం కైవసం చేసుకుంది. చివరి మ్యాచులో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సెంచరీతో చెలరేగింది.

సెంచరీతో చెలరేగిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్.. వన్డే సిరీసూ మనదే..
X

దిశ, స్పోర్ట్స్: ఇంగ్లండ్ గడ్డపై భారత అమ్మాయిలు అదరగొట్టారు. టీ20 సిరీసును నెగ్గిన జోరులోనే.. వన్డే సిరీసును కూడా తమ ఖాతాలో వేసుకున్నారు. మూడు వన్డేల సిరీసును 2-1 తేడాతో కైవసం చేసుకున్నారు. ఇంగ్లండ్ గడ్డపై భారత్ వరుసగా రెండోసారి వన్గే సిరీస్ నెగ్గడం గమనార్హం. చెస్టర్-లె-స్ట్రీట్ మైదానంలో జరిగిన ఈ మ్యాచులో భారత అమ్మాయిలు ముందుగా బ్యాటింగ్ చేశారు. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ (102) అద్భుతమైన శతకంతో రాణించగా.. స్మృతి మంధాన (45), హర్లీన్ డియోల్ (45), జెమీమా రోడ్రిగెజ్ (50), రిచా ఘోష్ (38 నాటౌట్) జతకలిశారు. దీంతో టీమిండియా 318/5 పరుగుల భారీ స్కోరు చేసింది. ఇది ఇంగ్లండ్‌పై భారత్‌కు రెండో అతిపెద్ద స్కోరు కావడం గమనార్హం.

అదరగొట్టిన క్రాంతి..

ఇక ఛేదనలో ఇంగ్లండ్‌ను భారత బౌలర్ క్రాంతి గౌడ్ ఆరంభంలోనే దెబ్బకొట్టింది. టామీ బ్యూమౌంట్ (2), అమీ జోన్స్ (4)ను అవుట్ చేసింది. అయితే ఎమ్మా లాంబ్ (68), నాట్ సివర్ బ్రంట్ (98), సోఫియా డంక్లీ (34), అలైస్ డేవిడ్సన్ (44) ఇంగ్లండ్ అభిమానుల్లో ఆశలు పెంచారు. కానీ ఆరు వికెట్లతో చెలరేగిన క్రాంతి.. వారి ఆశలపై నీళ్లు కుమ్మరించింది. దీంతో ఇంగ్లండ్ జట్టు 49.5 ఓవర్లలో 305 పరుగులకు ఆలౌట్ అయింది.

Next Story