- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సౌతాఫ్రికా చేతిలో టీమిండియా వైట్ వాష్.. హెడ్ కోచ్ గంభీర్‌పై BCCI కీలక ప్రకటన
రెండు టెస్టుల సిరీస్‌లో భారత్ (Team India) పర్యటక జట్టు సౌతాఫ్రికా (South Africa) చేతిలో ఘోర పరాజయం పాలైంది.

దిశ, వెబ్‌డెస్క్: రెండు టెస్టుల సిరీస్‌లో భారత్ (Team India) పర్యటక జట్టు సౌతాఫ్రికా (South Africa) చేతిలో ఘోర పరాజయం పాలైంది. దీంతో సిరీస్ సఫారీల వశమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బుధవారం గౌహతిలోని బర్సపారా స్టేడియంలో భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir)కు వ్యతిరేకంగా నినాదాలు హోరెత్తాయి. బహుమతి ప్రదానోత్సవం కోసం జట్టుతో పాటు గంభీర్ గ్రౌండ్‌లోకి వెళ్తుండగా.. అతను రాజీనామా చేయాలంటూ స్టాండ్స్ నుంచి అభిమానులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో అక్కడే ఉన్న పేసర్ మహమ్మద్ సిరాజ్ (Mohammed Siraj)తో పాటు సహాయ సిబ్బంది వారిస్తున్నా అభిమానులు ఆగలేదు. మరోవైపు గంభీర్‌ను హెడ్ కోచ్ పదవి నుంచి వెంటనే తొలగించాలంటూ సోషల్ మీడియాలో (Social Media) ఆయనకు వ్యతిరేకంగా జోరుగా క్యాంపెయిన్ నడుస్తోంది.
ఈ నేపథ్యంలోనే తన భవిష్యత్తుపై బీసీసీఐదే నిర్ణయమని గంభీర్ ప్రెస్ మీట్‌లో చెప్పిన క్రమంలో బోర్డు నుంచి ఆఫ్ ది రికార్డుగా ఒక సీనియర్ అధికారి ప్రకటన చేశారు. ఇప్పట్లో గంభీర్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోమని అన్నారు. అయితే, ప్రస్తుత జట్టులో పెద్ద ఎత్తున మార్పులు చేయాలని బోర్డు భావిస్తోందనే సమాచారం ప్రస్తుతం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.






