BCCI : టీంఇండియా టెస్ట్ కెప్టెన్సీ అనౌన్స్మెంట్ డేట్ ఫిక్స్!

by Muthe.Rajitha |

BCCI : టీంఇండియా టెస్ట్ కెప్టెన్సీ అనౌన్స్మెంట్ డేట్ ఫిక్స్!
X

దిశ, వెబ్ డెస్క్ : భారత క్రికెట్ జట్టు టెస్ట్ కెప్టెన్‌(Team India Test Captain)గా రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఆ బాధ్యత ఖాళీగా ఉంది. వచ్చేనెల ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ ఉండగా.. ప్రస్తుతం బీసీసీఐ(BCCI) టెస్ట్ కెప్టెన్ ను నియమించే పనిలో పడింది. అయితే టీంఇండియా టెస్ట్ కెప్టెన్ గా శుభ్‌మన్ గిల్(Shubhman Gill) నియామకం దాదాపుగా ఖాయం అయిందని క్రీడా వర్గాల, మీడియా సమాచారం. ఈ నేపథ్యంలో టీం ఇండియా టెస్ట్ కెప్టెన్ ఎవరన్నదీ బీసీసీఐ అధికారికంగా ప్రకటించే డేట్ ఫిక్స్ అయిందని.. ఈనెల 24న టెస్ట్ కెప్టెన్ ప్రకటన ఉంటుందని జాతీయ మీడియా కథనాలు ప్రసారం చేస్తోంది.

ఇంగ్లాండ్‌తో జూన్ 20 నుంచి ప్రారంభమయ్యే ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్(England Test Series) కోసం భారత జట్టు ఎంపిక చేయాల్సి ఉండగా.. దానికి ముందు కెప్టెన్ ను ప్రకటించనున్నారు. రోహిత్ శర్మ(Rohith Sharma) టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత జస్ప్రీత్ బుమ్రా(Jaspreet Bumra), శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీ రేసులో ముందున్నారు. అయితే బుమ్రా గాయాలు, వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ కారణంగా, 25 ఏళ్ల గిల్‌ను బీసీసీఐ ఎంచుకోనుందని తెలుస్తోంది. గిల్ ఇప్పటివరకు 32 టెస్ట్‌లలో 1893 పరుగులు సాధించాడు.

ఐదు సెంచరీలు, ఏడు హాఫ్-సెంచరీలతో సగటు 35.05. 2024లో జింబాబ్వే పర్యటనలో ఐదు T20I మ్యాచ్‌లకు నాయకత్వం వహించాడు. గుజరాత్ టైటాన్స్‌కు IPL 2024, 2025 సీజన్‌లలో కెప్టెన్‌గా వ్యవహరించాడు. బీసీసీఐ సెలక్షన్ కమిటీ, అజిత్ అగర్కర్ నేతృత్వంలో మే 23న ముంబైలో సమావేశమై ఇంగ్లాండ్ సిరీస్ కోసం జట్టును ఎంపికచేయనుంది. ఈ సమావేశంలోనే గిల్‌ను కెప్టెన్‌గా, రిషబ్ పంత్‌ను వైస్-కెప్టెన్‌గా ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.

Next Story