- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గంభీర్ టార్చర్... 4 గురు స్టార్ ఆటగాళ్లను కోల్పోయిన టీమిండియా?
గంభీర్ హెడ్ కోచ్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఏకంగా నలుగురు ప్లేయర్లు రిటైర్మెంట్ ప్రకటించారు.

gambhir
దిశ, వెబ్ డెస్క్: టీమిండియా క్రికెట్ లో పెను మార్పులు సంభవిస్తున్నాయి. ఈ సంవత్సర కాలంలో సీనియర్ క్రికెటర్లు చాలామంది రిటైర్మెంట్ కూడా ప్రకటించారు. యంగ్ క్రికెటర్లు తెరపైకి వస్తున్న నేపథ్యంలో సీనియర్లకు.. అవకాశాలు దక్కడం లేదు. దీంతో చాలామంది క్రికెటర్లు రిటైర్మెంట్ తీసుకునేందుకే మొగ్గు చూపిస్తున్నారు.
ముఖ్యంగా గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఏకంగా నలుగురు ప్లేయర్లు రిటైర్మెంట్ ప్రకటించారు. గతంలో ఈ నలుగురు ప్లేయర్లు టీమిండియాను శాసించారు. ఇందులో ఇద్దరు కెప్టెన్లు కావడం విశేషం. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరు ఒకేసారి టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించారు. అంతకుముందు అశ్విన్ కూడా ఆఫీస్ గడ్డపైనే రిటైర్మెంట్ తీసుకున్నాడు. ఇక ఇవాళ చతేశ్వర్ పూజారా కూడా... రిటైర్మెంట్ తీసుకున్నారు.
ఈ నలుగురు తోపు ప్లేయర్లు కూడా గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ గా ఉన్న సమయంలోనే రిటైర్మెంట్ తీసుకోవడం గమనార్హం. అయితే అంతకుముందు టీమిండియా కోచ్ గా రవి శాస్త్రి ఉన్నారు. ఆయన నాయకత్వంలో బెస్ట్ కెప్టెన్ గా కోహ్లీ అడిగాడు. బెస్ట్ ఓపెనర్ గా రోహిత్ శర్మ దుమ్ము లేపాడు. మోడ్రన్ వాల్ గా పూజారా చరిత్ర సృష్టించాడు. టెస్టుల్లో వరల్డ్ నెంబర్వన్ బౌలర్ గా అశ్విన్ రికార్డు లోకి ఎక్కిన సంగతి తెలిసిందే. ఇలా కోచులు మారినాకొద్దీ... టీమిండియా ప్లేయర్ల భవిష్యత్తు కూడా మారిపోతుంది. దీంతో గౌతమ్ గంభీర్ పై దారుణంగా అభిమానులు ఫైర్ అవుతున్నారు. క్లిక్






