- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎయిరిండియా మృతులకు నివాళులర్పించిన భారత జట్టు
ఎయిరిండియా మృతులకు భారత జట్టు నివాళులర్పించింది. ఇన్‌ట్రా స్క్వాడ్ మ్యాచ్‌లో కూడా నల్లటి బ్యాడ్జ్‌లు ధరించి ఆడింది.

X
దిశ, స్పోర్ట్స్: టీమిండియా సీనియర్ జట్టు, ఇండియా-ఎ మధ్య శుక్రవారం నాడు ఇంగ్లండ్‌లో బెకెన్‌హం వేదికగా ఇంట్రాస్క్వాడ్ మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్ ఆరంభానికి ముందు రెండు జట్ల ప్లేయర్లు ఎయిరిండియా విమాన ప్రమాదంలో మరణించిన వారికి సంతాపం తెలిపారు. వారికి నివాళులర్పించేందుకు నల్లటి ఆర్మ్‌బ్యాండ్స్ ధరించి మ్యాచ్ ఆడేందుకు సిద్ధమయ్యారు ప్లేయర్లు, స్టాఫ్ అందరూ. అలాగే ఒక నిమిషం పాటు మౌనం పాటించారు. కాగా, గురువారం నాడు గుజరాత్‌లోని అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి టేకాఫ్ అయిన ఎయిరిండియా విమానం.. ఐదు నిమిషాల వ్యవధిలోనే కూలిపోయిన సంగతి తెలిసిందే. విమానంలో ఉన్న 242 మందిలో ఒక్కరు తప్ప అందరూ దుర్మరణం పాలయ్యారు. పలువురు మాజీ దిగ్గజ క్రికెటర్లు, కోహ్లీ, రోహిత్ అందరూ ఈ ఘటనపై సంతాపం ప్రకటించారు.
Next Story






