ఆసీస్ మ్యాచ్‌లో భారత క్రికెటర్ల రికార్డులు

by Ajay Maddhiboyina |

బ్యాటింగ్‌లో కూడా ఇండియన్ క్రికెటర్లు అరుదైన రికార్డులను చేరుకున్నారు.

ఆసీస్ మ్యాచ్‌లో భారత క్రికెటర్ల రికార్డులు
X

- వన్డేల్లో రోహిత్ అత్యధిక సిక్సులు

- ఫీల్డర్‌గా రెండో అత్యధిక క్యాచ్‌లు పట్టిన కోహ్లీ

- ఛేజింగ్‌లో 8 వేల పరుగులు దాటిన కింగ్

దిశ, స్పోర్ట్స్: చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్ వేదికగా ఆసీస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత క్రికెటర్లు పలు రికార్డులు నెలకొల్పారు. విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్‌లో రెండు క్యాచ్‌లు పట్టాడు. దీంతో వన్డేల్లో ఫీల్డర్‌గా అత్యధిక క్యాచ్‌లు పట్టిన రెండో క్రికెటర్‌గా నిలిచాడు. కోహ్లీ ఇప్పటి వరకు 161 క్యాచ్‌లు పట్టాడు. కోహ్లీ కంటే ముందు శ్రీలంకకు చెందిన మహేళ జయవర్దనే 218 క్యాచ్‌లతో టాప్ పొజిషన్‌లో ఉన్నాడు. ఇక కోహ్లీ తర్వాత రికీ పాంటింగ్ 160, మహ్మద్ అజారుద్దీన్ 156, రాస్ టేలర్ 142లు టాప్-5లో ఉన్నారు.

ఇక బ్యాటింగ్‌లో కూడా ఇండియన్ క్రికెటర్లు అరుదైన రికార్డులను చేరుకున్నారు. భారత జట్టు కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మ ఐసీసీ వన్డే టోర్నీల్లో అత్యధిక సిక్సులు బాదిన క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు. రోహిత్ శర్మ 42 ఇన్నింగ్స్‌లలో 65 సిక్సులతో అగ్రస్థానంలో ఉన్నాడు. అంతకు ముందు ఈ రికార్డు వెస్టిండీస్ బ్యాటర్ క్రిస్ గేల్ పేరు మీద ఉండేది. గేల్ 51 ఇన్నింగ్స్‌లో 64 సిక్సులు కొట్టాడు. ఆ తర్వాత స్థానాల్లో గ్లెన్ మ్యాక్స్‌వెల్ (49 సిక్సులు), డేవిడ్ మిల్లర్ (45), సౌరభ్ గంగూలీ (42), డేవిడ్ వార్నర్ (42), ఇయాన్ మోర్గాన్ (40), ఏబీ డివిలియర్స్ (39), బ్రెండన్ మెక్‌కల్లమ్ (36)లు ఉన్నారు.

భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి ఛేజింగ్‌లో మంచి రికార్డులు ఉన్నాయి. తాజాగా ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఛేజింగ్‌లో 8 వేల పరుగులు దాటాడు. కోహ్లీకి ఛేజింగ్‌లో 64.54 సగటు ఉంది. ఇక టాప్ పొజిషన్‌లో 8,720 పరుగులతో సచిన్ టెండుల్కర్ టాప్ పొజిషన్‌లో ఉన్నాడు. సచిన్ సగటు 42.33గా ఉంది. మూడో స్థానంలో రోహిత్ శర్మ 6,115 పరుగులు, నాలుగో స్థానంలో సనత్ జయసూర్య 5,742 పరుగులు, జాక్వెస్ కల్లీస్ 5,575 పరుగులతో తర్వాతి స్థానంలో ఉన్నాడు.

Next Story