Official Announcement: తండ్రైన టీమిండియా స్టార్ ప్లేయర్

by Gantepaka Srikanth |

టీమిండియా(Team India) స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్(KL Rahul) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు.

Official Announcement: తండ్రైన టీమిండియా స్టార్ ప్లేయర్
X

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా(Team India) స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్(KL Rahul) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. మొన్ననే తనదైన శైలిలో రాణించి భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy 2025) సాధించడంలో కీలక పాత్ర పోషించారు. ఒకటి, రెండు మ్యాచులు మినహా అన్నింట్లోనూ అద్భుతంగా రాణించారు. ముఖ్యంగా న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో అదరగొట్టాడు. మ్యాచ్ చేతిలోకి వచ్చిన సమయంలో వరుసగా వికెట్లు పడినా.. రాహుల్ నిరాశ పర్చలేదు. చివరి వరకు క్రీజులో ఉండి జట్టుకు విజయాన్ని అందించారు. అయితే తాజాగా రాహుల్ ఓ శుభవార్త చెప్పారు. ఆయన తండ్రి అయినట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఆయన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ‘శుభాకాంక్షలు’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

కాగా, ప్రముఖ బాలీవుడ్(Bollywood) నటుడు సునీల్‌శెట్టి(Sunil Shetty) కుమార్తె అతియా శెట్టి(Athiya Shetty)ని రాహుల్ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. మహారాష్ట్రలో ఖండాలాలోని సునీల్‌శెట్టికి చెందిన ఫామ్‌హౌస్‌లో వీరి వివాహం వైభవంగా జరిగింది. పెళ్లయ్యాక కొన్నాళ్లు జట్టుకు దూరం అయిన రాహుల్.. ఇటీవలే మళ్లీ భారత జట్టులో చోటు దక్కించుకుని వరుసగా రాణిస్తున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచి వారం కూడా గడవక ముందే మరో రాహుల్ మరో శుభవార్త చెప్పడంతో తోటి ప్లేయర్లంతా విషెస్ చెబుతున్నారు.

Next Story