- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కింగ్ చార్లెస్‌ను కలిసిన టీమిండియా.. సిరాజ్ అవుట్‌పై ఆయనేమన్నారంటే?
by Phanindra |
ఇంగ్లండ్ కింగ్ చార్లెస్‌ను టీమిండియా మహిళల, పురుషుల జట్లు కలిశాయి. సిరాజ్ అవుట్‌పై ఆయనేమన్నారో గిల్ వెల్లడించాడు.

X
దిశ, స్పోర్ట్స్: లార్డ్స్ టెస్టులో టీమిండియా ఓడిన తర్వాత భారత పురుషుల, మహిళల జట్టుకు ఇంగ్లండ్ కింగ్ చార్లెస్ III ఆహ్వానం అందింది. ఇరు జట్లను కలిసిన ఆయన.. ప్లేయర్లతో ముచ్చటించి, ఫొటోలు దిగారు. అనంతరం మాట్లాడిన గిల్.. తమ చివరి వికెట్ కోల్పోయిన తీరు బాధాకరమని కింగ్ చార్లెస్ చెప్పారని తెలిపాడు. ‘కింగ్ చార్లెస్‌ను కలవడం అద్భుతంగా ఉంది. మంచి మనసుతో మమ్మల్ని ఆయన ఇలా ఆహ్వానించారు. కాసేపు మాతో చక్కగా మాట్లాడారు. మా చివరి బ్యాట్స్‌మెన్ అవుటైన తీరు చాలా బాధాకరమని, బంతి దొర్లుకుంటూ వెళ్లి వికెట్లు పడగొట్టం బాధ కలిగించిందని ఆయన చెప్పారు. మేం కూడా అది దురదృష్టకరమైనా.. మ్యాచ్ ఎవరైనా గెలిచే చాన్స్ ఉందని చెప్పాం. వచ్చే రెండు మ్యాచుల్లో మాకు అదృష్టం కలిసొస్తుందని అనుకుంటున్నా’ అని గిల్ పేర్కొన్నాడు.
Next Story






