- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ind Vs Pak: పాకిస్థాన్ కు షాక్...2018 హిస్టరీ రిపీట్ కానుందా !
2018 ఆసియా కప్ చరిత్ర రిపీట్ అవుతుందని పాకిస్థాన్ వణికిపోతున్నట్లు వార్తలు వస్తున్నాయి

దిశ, వెబ్ డెస్క్ : ఆసియా కప్ 2025 టోర్నమెంట్ లో భాగంగా టీమిండియా వర్సెస్ పాకిస్థాన్ జట్ల మధ్య రెండో మ్యాచ్ జరుగనుంది. ఒకటి లీగ్ దశలో జరుగగా... మరోటి సూపర్ 4 లో భాగంగా ఇవాళ జరుగతోంది. ఈ మ్యాచ్ కు దుబాయ్ వేదికగా కానుంది. ఇవాళ రాత్రి 8 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఇక ఇందులో మొదట బౌలింగ్ చేసిన జట్టు గెలిచే ఛాన్స్ ఉన్నట్లు చెబుతున్నారు.
2018 చరిత్ర రిపీట్ కానుందా ?
2018 ఆసియా కప్ చరిత్ర రిపీట్ అవుతుందని పాకిస్థాన్ వణికిపోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ సమయంలో... కూడా గ్రూప్ స్టేజ్, సూపర్ 4 లోనూ పాకిస్థాన్ ను చిత్తుగా ఓడించింది టీమిండియా. ఆ తర్వాత... ఫైనల్స్ లో టీమిండియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య ఫైట్ జరిగింది. ఇందులో గెలిచి, ఛాంపియన్ గా టీమిండియా నిలిచింది. ఇక ఈ సారి జరుగుతున్న టోర్నమెంట్ కూడా అలాగే సాగుతోందని పాకిస్థాన్ ఫ్యాన్స్ భయపడిపోతున్నారు. అంటే ఈ లెక్కన ఇవాళ్టి మ్యాచ్ లోనూ పాకిస్థాన్ ను టీమిండియా ఓడిస్తుందని అంచనా వేస్తున్నారు.






