- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
క్రికెట్ ఫ్యాన్స్ కు శుభవార్త..విశాఖలో టీమిండియా మ్యాచ్..ఎప్పుడంటే ?
తెలుగు క్రికెట్ అభిమానులకు అదిరిపోయే శుభవార్త అందింది. గత కొన్ని రోజులుగా హైదరాబాద్ ( Hyderabad ) లేదా వైజాగ్ లో ( Viza

దిశ, వెబ్ డెస్క్: తెలుగు క్రికెట్ అభిమానులకు అదిరిపోయే శుభవార్త అందింది. గత కొన్ని రోజులుగా హైదరాబాద్ ( Hyderabad ) లేదా వైజాగ్ లో ( Vizag) అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ( International cricket match) జరగడం లేదన్న సంగతి తెలిసిందే. ఐపీఎల్ మ్యాచ్ లు ( IPL matches) మాత్రమే ఉప్పల్ అదే సమయంలో వైజాగ్ స్టేడియంలో (Vizag Stadium ) జరుగుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో... వైజాగ్ లో అంతర్జాతీయ మ్యాచ్ జరగబోతున్నట్లు... తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది.
ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య 2026 లో 5 టీ20 మ్యాచ్ లు జరగనున్నాయి. జనవరి 21వ తేదీ నుంచి జనవరి 31, 2026 వరకు ఈ టి20 సిరీస్ జరగనుంది. అయితే నాలుగోవ టి20 మాత్రం వైజాగ్ వేదికగా జరగనున్నట్లు తెలుస్తోంది. జనవరి 28వ తేదీన విశాఖపట్నంలోని అంతర్జాతీయ స్టేడియంలో ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య నాలుగవ టి20 మ్యాచ్ జరగనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో తెలుగు అభిమానులందరూ టికెట్లు బుక్ చేసుకోవాలని.. కొంత మంది సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా.. న్యూజిలాండ్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య జరిగే టి20లు జరిగే వేదికలలో హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియం మాత్రం లేదు. కేవలం విశాఖపట్నంలో నాలుగో టి20 మ్యాచ్ మాత్రమే జరగనుంది. మిగిలిన టి20 లు నాగపూర్, రాయపూర్, గౌహతి, తిరువనంతపురం లో జరగనున్నాయి.
Instagramme link






