మూడో టెస్ట్‌లో టీమిండియా ఓటమి

by Sathputhe Rajesh |

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మూడో టెస్ట్‌లో టీమిండియా ఓటమి పాలయ్యింది.

మూడో టెస్ట్‌లో టీమిండియా ఓటమి
X

దిశ, వెబ్‌డెస్క్: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మూడో టెస్ట్‌లో టీమిండియా ఓటమి పాలయ్యింది. భారత్ పై ఆసీస్ 9 వికెట్ల తేడాతో గెలిచింది. టీమిండియా నిర్దేశించిన 76 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆసీస్ ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది. దీంతో నాలుగు టెస్ట్ సిరీస్ లో భారత్ ఆధిక్యం 2 - 1 కి తగ్గింది. చివరి టెస్ట్ మ్యాచ్ మార్చి 9 నుంచి అహ్మదాబాద్ వేదికగా ప్రారంభం కానుంది.

టీమ్ ఇండియా నిర్దేశించిన 76 పరుగుల లక్ష్య ఛేదనలో ఆసీస్ తొలి ఓవర్ లోనే వికెట్ కోల్పోయింది. తర్వాత క్రీజ్ లోకి వచ్చిన లబుషేన్ (28), ఓపెనర్ ట్రావిస్ హెడ్ (49) ఆసీస్‌ను విజయ తీరాలను చేర్చారు. టీమిండియా తొలి రెండు టెస్ట్‌ల్లో స్పిన్‌తో ఆసీస్‌తో బోల్తా కొట్టిస్తే మూడో టెస్ట్‌లో స్పిన్ మంత్రం టీమిండియాపై తిరగబడటం గమనార్హం.

Next Story