- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆసీస్ బౌలర్ల ఊచకోత..కష్టాల్లో టీమిండియా..4 వికెట్లు డౌన్
టీమిండియా, కష్టాల్లో పడింది. టాపార్డర్ మొత్తం కుప్పకూలింది. గిల్ 5 పరుగులు చేసి ఔట్ కాగా

దిశ, వెబ్ డెస్క్: మెల్ బోర్న్ వేదికగా జరుగుతున్న రెండో టీ20లో పీకల్లోతు కష్టాల్లో పడింది టీమిండియా. 40 పరుగులు పూర్తికాక ముందే నాలుగు వికెట్లు కోల్పోయింది. టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య కాసేపటికి క్రితమే రెండో టి20 ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇందులో టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా, కష్టాల్లో పడింది. ఆస్ట్రేలియా బౌలర్ల దాటికి టాపార్డర్ మొత్తం కుప్పకూలింది.
గిల్ 5 పరుగులు చేసి ఔట్ కాగా, కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ఒకే ఒక్క పరుగు చేసి వెనుతిరిగాడు. ఫస్ట్ డౌన్ లో వచ్చిన సంజూ రెండు పరుగులకే ఔట్ కాగా తిలక్ వర్మ డకౌట్ అయ్యాడు. దీంతో నాలుగు వికెట్లు కోల్పోయింది టీమిండియా. ఇక ఇప్పటి వరకు 6.3 ఓవర్లు ఆడిన టీమిండియా నాలుగు వికెట్లు నష్టపోయి 46 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ 34 పరుగులతో కొనసాగుతుండగా అక్షర్ పటేల్ నాలుగు పరుగులు చేశాడు. ఇద్దరు భాగస్వామ్యం నెలకొల్పే ప్రయత్నం చేస్తున్నారు.






