- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
IND vs PAK: పాకిస్థాన్ తో టీమిండియాకు మరో మ్యాచ్..ఎప్పుడంటే
మరోసారి ఫైనల్స్ లో టీమిండియా వర్సెస్ పాకిస్థాన్ మధ్య ఫైట్ జరిగే ఛాన్స్ లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సూపర్ 4 లో

దిశ, వెబ్ డెస్క్ : ఆసియా కప్ లో భాగంగా మరోసారి పాకిస్థాన్ తో టీమిండియా తలపడనుంది. ఇప్పటికే ఈ టోర్నమెంట్ లో రెండు సార్లు ఈ రెండు జట్లు పోటీ పడ్డాయి. మరోసారి ఫైనల్స్ లో టీమిండియా వర్సెస్ పాకిస్థాన్ మధ్య ఫైట్ జరిగే ఛాన్స్ లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సూపర్ 4 లో భాగంగా...నిన్న టీమిండియా చేతిలో ఓడిన పాకిస్థాన్... తర్వాత జరిగే అన్ని మ్యాచ్ ల్లో విజయం సాధించాల్సి ఉంటుంది.
రేపు శ్రీలంక వర్సెస్ పాకిస్తాన్ మధ్య అబుదాబీ వేదికగా మ్యాచ్ జరుగనుంది. అలాగే.. 25 వ తేదీన బంగ్లాదేశ్ లాంటి చిన్న కంట్రీతో ఆడనుంది పాకిస్థాన్. ఈ రెండు మ్యాచ్ లలో పాకిస్థాన్ విజయం సాధిస్తే... ఫైనల్ కు వెళుతుంది. ఒకవేళ ఓడితే.. ఇంటికే వెళుతుంది. నిజంగానే గెలిస్తే.. ఫైనల్స్ లో దాయాదుల పోరు చూడొచ్చు. ఇప్పుడు ఇదే కోరుకుంటున్నారు టీమిండియా ఫ్యాన్స్. ఫైనల్స్ లో కూడా పాకిస్థాన్ ను ఓడించాల్సిందేనని కామెంట్స్ చేస్తున్నారు. కాగా నిన్నటి రోజున జరిగిన మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో పాకిస్థాన్ పై టీమిండియా విజయం సాధించింది.






