మళ్లీ పెళ్లి చేసుకోనున్న శిఖర్ ధావన్

by Naga Rani Yarlagadda |

టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావర్ మళ్లీ పెళ్లి చేసుకోనున్నాడు.

మళ్లీ పెళ్లి చేసుకోనున్న శిఖర్ ధావన్
X

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావర్ మళ్లీ పెళ్లి చేసుకోనున్నాడు. ఫిబ్రవరి థర్డ్ వీక్ లో తన ప్రేయసి సోఫీ షైన్ ను ఢిల్లీలో పెళ్లాడనున్నాడు. ఈ వేడుకకు క్రికెటర్లు, బాలీవుడ్ ప్రముఖులు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి నుంచే పెళ్లి వేడుకకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఐర్లాండ్ కు చెందిన సోఫీ షైన్ తో ధావన్ కొంతకాలం రిలేషన్ షిప్ లో ఉన్నట్లు వార్తలొచ్చాయి. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైన్ మ్యాచ్ లో ధావన్ సోఫీతో కలిసి కనిపించడంతో.. వీరి రిలేషన్ షిప్ అఫీషియల్ గా కన్ఫర్మ్ అయింది. ఒక కార్యక్రమంలో దీనిపై ధావన్ ను విలేకరులు ప్రశ్నించగా.. ఆమె పేరు చెప్పను కానీ.. తన ప్రపంచంలో చాలా అందమైన అమ్మాయి అని అభివర్ణించాడు.

2012లో శిఖర్ ధావన్ ఆస్ట్రేలియాకు చెందిన బాక్సర్ ఆయేషా ముఖర్జీని పెళ్లాడాడు. 2014లో వీరికి ఒక బాబు జన్మించగా.. 2020 నుంచి మనస్పర్థల కారణంగా దూరంగా ఉంటున్నారు. మూడేళ్ల తర్వాత ఢిల్లీ ఫ్యామిలీ కోర్టు వీరికి విడాకులు మంజూరు చేసింది.

Next Story