- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టీంఇండియా క్రికెట్ జట్టుకు ఇంగ్లాండ్ రాజు ఆతిధ్యం
by Muthe.Rajitha |
ఐదు టెస్టుల సిరీస్ కోసం భారత క్రికెట్ జట్టు ఇంగ్లండ్ లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.

X
దిశ, వెబ్ డెస్క్ : ఐదు టెస్టుల సిరీస్ కోసం భారత క్రికెట్ జట్టు ఇంగ్లండ్ లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే టీంఇండియా(Team India) క్రికెట్ జట్టుకు ఇంగ్లాండ్ రాజు చార్లెస్ III(King Charles III) ఆతిథ్యం ఇచ్చారు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తోసహా జట్టు సభ్యులంతా ఇంగ్లండ్ ప్రిన్స్ ప్యాలస్ లో సందడి చేసారు. ఈ క్రమంలో చార్లెస్ III టీంలోని ప్రతి సభ్యునితో కరచాలనం చేసి పరిచయం చేసుకున్నారు. వారి ఆటతీరును కొనియాడుతూ.. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. కాగా ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ(Anderson-Tendulkar Trophy)లో ఇప్పటికే 3 టెస్టులు ముగియగా.. 2-1 తో ఇంగ్లండ్ జట్టు ముందంజలో ఉంది. తదుపరి మ్యాచ్ ఈనెల 23న జరగనుంది.
Next Story






