- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, వెబ్ డెస్క్: వరల్డ్ కప్ లో అదరగొడుతున్న హార్దిక్ పాండ్యాకు ఊహించని షాక్ ఇచ్చాడు గంభీర్. ఏకంగా హార్దిక్ పాండ్యా కళ్ళముందే, మహికా శర్మను కోచ్ గౌతమ్ గంభీర్ హగ్ చేసుకున్నాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇది చూసిన హార్దిక్ పాండ్యా ఫ్యాన్స్ చాలా సీరియస్ అవుతున్నారు. కోచ్ పదవిలో ఉన్న గంభీర్, ఇలా కాపురాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఫైర్ అవుతున్నారు పాండ్యా ఫ్యాన్స్.
హార్దిక్ పాండ్యా ప్రియురాలికి గంభీర్ హగ్ !
టి20 వరల్డ్ కప్ లో భారత జట్టు ఫైనల్ చేరుకున్న సంగతి తెలిసిందే. మార్చి 8వ తేదీన న్యూజిలాండ్ తో ఫైనల్ కూడా ఆడనుంది భారత్. ఈ తరుణంలో ముంబై నుంచి అహ్మదాబాద్ బయలు దేరింది భారత జట్టు బృందం. ఈ సందర్భంగా తన ప్రియురాలు మహికా శర్మతో కలిసి హార్దిక్ పాండ్యా కూడా అహ్మదాబాద్ బయలుదేరాడు. ఈ క్రమంలో హార్దిక్ పాండ్యా జంటను చూసిన భారత హెడ్ కోచ్ గంభీర్, కాస్త ఓవర్ చేశారు.
వెంటనే పాండ్యా ప్రియురాలును హగ్ చేసుకున్నారు గంభీర్. ఈ వీడియో వైరల్ అయింది. దీంతో గంభీర్ ను ఒక ఆట ఆడుకుంటున్నారు హార్దిక్ పాండ్యా ఫ్యాన్స్. ఇది ఇలా ఉండగా, నటాషాకు విడాకులు ఇచ్చిన హార్దిక్ పాండ్యా, ప్రస్తుతం మహికా శర్మ డేటింగ్ లో ఉన్నాడు. త్వరలోనే మహికాను పెళ్లి కూడా చేసుకోనున్నాడు. అందుకే చాలా రోజుల నుంచే ఈ జంట చెట్టాపట్టాలెసుకుని తిరుగుతోంది. అటు హార్దిక్ పాండ్యా మాజీ భార్య నటాషా మాత్రం, సింగిల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు.






