- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జింబాబ్వేపై గెలిచిన భారత్ కు బిగ్ షాక్..సెమీ ఫైనల్ కష్టమేనా ?
జింబాబ్వే పై విజయం సాధించినప్పటికీ, నెగిటివ్ లోనే ఇండియా నెట్ రన్ రేట్ ఉంది. అదే అంశం తలనొప్పిగా మారింది.

దిశ, వెబ్ డెస్క్: టీ20 వరల్డ్ కప్ లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తప్పక గెలవాల్సిన సూపర్ 8 మ్యాచ్ లో భారత జట్టు అదరగొట్టింది. చెన్నై వేదికగా జరిగిన జింబాబ్వే మ్యాచ్ లో 72 పరుగులు తేడాతో భారత్ విక్టరీ అందుకుంది. అయితే ఈ విజయం అందుకున్న భారత్, సెమీ ఫైనల్ వెళ్తుందని అందరూ అనుకుంటున్నారు. కానీ ఇండియన్ ఫ్యాన్స్ కు ఐసీసీ లెక్కలు షాక్ ఇచ్చాయి. జింబాబ్వేపైన గెలిచిన భారత్ , గ్రూప్ 1 టేబుల్ లో దక్షిణాఫ్రికా తర్వాత రెండో స్థానంలో నిలుస్తుందని అందరూ అనుకున్నారు. తద్వారా సెమీ ఫైనల్ దూసుకు వెళ్తుందని చర్చించుకున్నారు. కానీ దక్షిణాఫ్రికా మొదటి మ్యాచ్ లోనే ఓడిపోయిన భారత్, నెగిటివ్ రన్ రేట్ సాధించుకుంది.
భారత్ ను టెన్షన్ పెడుతోన్న నెట్ రన్ రేట్
ఇక జింబాబ్వే పైన 72 పరుగుల తేడాతో విజయం సాధించినప్పటికీ, ఇంకా నెగిటివ్ లోనే ఇండియా నెట్ రన్ రేట్ ఉంది. ఇప్పుడు అదే అంశం తలనొప్పిగా మారింది. ప్రస్తుత టీం ఇండియా నెట్ రన్ రేట్ -.0.100 గా ఉంది. అటు వెస్టిండీస్ నెట్ రన్ రేట్ 1.791 గా ఉంది. దీంతో టేబుల్ లో రెండవ స్థానాన్ని దక్కించుకుంది వెస్టిండీస్. అయితే ఇండియాతో పాటు వెస్టిండీస్ ఖాతాలో రెండు పాయింట్లు మాత్రమే ఉన్నాయి.
ఈ రెండు జట్టు భారత్, వెస్టిండీస్‌ల మధ్య మార్చి ఒకటో తేదీన మ్యాచ్ ఉండనుంది. ఇందులో గెలిచిన జట్టు, నాలుగు పాయింట్లు సాధించడమే కాకుండా సెమీస్ కు వెళుతుంది. అప్పుడు మైనస్ నెట్ రన్ రేట్ ఉన్నా కూడా భారత జట్టుకు ఇలాంటి సమస్య ఉండదు. ఇక అటు ఇప్పటికే దక్షిణాఫ్రికా సెమీస్ లో అడుగుపెట్టింది. తాజాగా వెస్టిండీస్ జట్టును చిత్తు చేసి మరీ దూసుకు వెళ్ళింది. ఇదే గ్రూప్ లో ఉన్న జింబాబ్వే, ఇండియా ( India) చేతిలో ఓడిపోయి ఇంటి దారి పట్టింది. ఇక ఇప్పుడు భారత్, వెస్టిండీస్ జట్లు మాత్రమే రెండో సెమీస్ బెర్త్ కోసం పోటీ పడుతున్నాయన్న మాట.
ఇదంతా పక్కకు పెడితే గురువారం రెండు మ్యాచ్ లు జరిగాయి. మొదట వెస్టిండీస్ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా మ్యాచ్ నిర్వహించారు. ఇందులో భారత జట్టుకు అనుకూలంగా దక్షిణాఫ్రికా విజయం సాధించింది. వెస్టిండీస్ పైన ఏకంగా 9 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా విక్టరీ అందుకుంది. వెస్టిండీస్ పైన విజయం సాధించి నేరుగా సెమీస్ కు వెళ్ళింది. మరోవైపు సాయంత్రం ఏడు గంటలకు భారత్, జింబాబ్వే జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో కూడా అభిమానులు కోరుకున్నట్లుగా భారత్ విజయం సాధించింది. జింబాబ్వే పైన ఏకంగా 72 పరుగులు తేడాతో పెద్ద విజయాన్ని అందుకుంది భారత్.






