గంభీర్ ఇంట్లో నైట్‌ పార్టీ..చిల్ అయిన‌ భార‌త ప్లేయ‌ర్లు !

by velandi.Saikiran |

టి20 వరల్డ్ కప్ నేపథ్యంలో ఫిబ్రవరి 12వ తేదీన నమీబియాతో మ్యాచ్ ఆడనుంది భారత జట్టు.

గంభీర్ ఇంట్లో నైట్‌ పార్టీ..చిల్ అయిన‌ భార‌త ప్లేయ‌ర్లు !
X

దిశ‌, వెబ్ డెస్క్‌: భారత జట్టు ప్రస్తుతం టీ20 వరల్డ్ కప్ ఆడుతున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 7వ తేదీన ప్రారంభమైన ఈ మెగా టోర్నమెంట్ లో ఇప్పటికే భారత జట్టు తొలి విజయాన్ని నమోదు చేసుకొని మంచి ఊపులో ఉంది. ఈ టోర్నమెంట్ లో భాగంగా గ్రూప్ స్టేజ్ లో మొత్తం నాలుగు మ్యాచ్ లు ఆడాల్సి ఉంటుంది ఇండియా. ఇప్పటికే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాతో తొలి మ్యాచ్ ఆడిన సూర్య కుమార్ యాదవ్ సేన, 29 పరుగుల తేడాతో విజయం కూడా సాధించింది. ఇక ఈ మ్యాచ్ అనంతరం ఢిల్లీకి చేరుకున్న భారత జట్టుకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చాడు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్. భారత జట్టుకు సంబంధించిన ప్లేయర్లు, సిబ్బందికి ఢిల్లీలో స్పెషల్ ట్రీట్ ఇచ్చారు గౌతమ్ గంభీర్. గతంలో వెస్టిండీస్ తో జరిగిన టెస్ట్ సిరీస్ సందర్భంగా కూడా గౌతమ్ గంభీర్, భారత ప్లేయర్లకు స్పెషల్ విందు ఏర్పాటు చేశారు.

గంభీర్ ఇంట్లో స్పెషల్ డిన్నర్

టీ20 వరల్డ్ కప్ నేపథ్యంలో ఫిబ్రవరి 12వ తేదీన నమీబియాతో మ్యాచ్ ఆడనుంది భారత జట్టు. ఈ మ్యాచ్ ఢిల్లీలోని అరుణ్ జెట్లీ స్టేడియం లో జరగనుంది. అయితే గౌతమ్ గంభీర్ హోమ్ టౌన్ కూడా ఢిల్లీ కావడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే ఫిబ్రవరి 12వ తేదీన నమీబియాతో మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో ఢిల్లీకి చేరుకుంది భారత జట్టు. ముంబై నుంచి నేరుగా ఢిల్లీకి వచ్చిన ప్లేయర్లు గౌతమ్ గంభీర్ ఇచ్చిన డిన్నర్ పార్టీకి ( Dinner) వెళ్లారు. గౌతమ్ గంభీర్ ఇంట్లో ఏర్పాటు చేసిన ఈ డిన్నర్ పార్టీకి సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, మిగిలిన భారత జట్టు ప్లేయర్లు అందరూ కూడా పాల్గొన్నారు.

అటు భారత జట్టుకు సంబంధించిన సిబ్బంది కూడా పాల్గొని సందడి చేసింది. ఈ డిన్నర్ లో ఢిల్లీ స్పెషల్ ఐటమ్స్ పెట్టినట్లు తెలుస్తోంది. అయితే ఈ డిన్నర్ నేపథ్యంలో గౌతమ్ గంభీర్ ఇంటికి స్పెషల్ బస్సులో సూర్య కుమార్ యాదవ్ సేన వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇది చూసిన భారత జట్టు అభిమానులు తెగ సంతోష పడిపోతున్నారు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇచ్చిన దావత్ ను సూర్య కుమార్ యాదవ్ సేన ఆస్వాదించాలని, ఈ ఊపుతో వరల్డ్ కప్ కూడా కొట్టాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. ఇది ఇలా ఉండ‌గా టీ20 వరల్డ్ కప్ నేపథ్యంలో ఇండియా, పాక్ మ్యాచ్ జ‌రిగే ఛాన్సులు ఎక్కువ‌గా ఉన్న‌ట్లు స‌మాచారం అందుతోంది.ఈ మేర‌కు పాకిస్తాన్ ఒప్పుకున్న‌ట్లు టాక్ న‌డుస్తోంది. ఇవాళ ఐసీసీ వైస్ ఛైర్మ‌న్ కూడా పాకిస్తాన్ కు వెళ్లారు. ఈ సంద‌ర్భంగా పాకిస్తాన్ బోర్డు ఛైర్మ‌న్ న‌ఖ్వీని కూడా క‌లిసారు. దీంతో శాంతి చ‌ర్చ‌లు జ‌రిపిన‌ట్లు స‌మాచారం.

Next Story