గంభీర్ ఇంట్లో పార్టీ..బ‌స్సులో ప్లేయ‌ర్లు గ్రాండ్ ఎంట్రీ

by velandi.Saikiran |

టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇంటికి గిల్ సార‌ధ్యంలోని టీం గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ఇవాళ టీమిండియా ప్లేయర్ల‌కు పార్టీ

గంభీర్ ఇంట్లో పార్టీ..బ‌స్సులో ప్లేయ‌ర్లు గ్రాండ్ ఎంట్రీ
X

దిశ‌, వెబ్ డెస్క్ : టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇంటికి గిల్ సార‌ధ్యంలోని టీం గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ఇవాళ టీమిండియా ప్లేయర్ల‌కు పార్టీ ఇస్తున్నాడు గౌతమ్ గంభీర్. ఈ నేపథ్యంలో వెస్టిండీస్ సిరీస్ కోసం సెలెక్ట్ అయిన టీమిండియా ప్లేయర్లు, స్టాఫ్ ను ఈ డిన్నర్ కు ఆహ్వానించాడు గౌతమ్ గంభీర్. దీంతో గిల్ కెప్టెన్సీ లో ఆడుతున్న టీమిండియా ప్లేయర్లు ఓ లగ్జరీ బస్సు లో ఢిల్లీలోని గౌతమ్ గంభీర్ ఇంటికి వచ్చారు. ఈ సందర్భంగా ప్లేయర్లకు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు గౌతమ్ గంభీర్ కుటుంబ సభ్యులు. వెస్టిండీస్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య ఈ నెల 10వ తేదీ నుంచి ఢిల్లీ వేదికగా రెండో టెస్ట్ జరగనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ టెస్ట్ కంటే ముందు ప్లేయర్ల‌కు హెడ్ కోచ్ గంభీర్ పార్టీ ఇవ్వడం గమనార్హం. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. క్లిక్

Next Story