- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
IND VS ENG: మొదటి ఇన్నింగ్స్ లో టీమిండియా ఆలౌట్
టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఐదో టెస్ట్ మ్యాచ్ లో పీకల్లోతు కష్టాల్లో పడింది గిల్ సేన. ఐదో టెస్ట్ మ్యాచ్

X
దిశ, వెబ్ డెస్క్: టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఐదో టెస్ట్ మ్యాచ్ లో పీకల్లోతు కష్టాల్లో పడింది గిల్ సేన. ఐదో టెస్ట్ మ్యాచ్ లోని తొలి ఇన్నింగ్స్ లో 224 పరుగులకే ఆలౌట్ అయింది టీమిండియా. ఈ మొదటి ఇన్నింగ్స్ లో 69.4 ఓవర్లు ఆడి... 224 పరుగులకే తోకముడిచింది. ఇంగ్లాండ్ బౌలర్ల దెబ్బకు... ఇద్దరూ డకౌట్ కాగా... టాప్ ఆర్డర్ దారుణంగా విఫలమైంది.
ఇక కరుణ్ నాయర్ ఒక్కడే 57 పరుగులతో రాణించాడు. మిగతా ప్లేయర్లందరూ విఫలమయ్యారు. ఇక మొదటి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ బౌలర్లు అదరగొట్టారు. వచ్చిన ఏ అవకాశాన్ని కూడా వదులుకోలేదు. ముఖ్యంగా గస్ ఆట్కిన్‌సన్ ఐదు వికెట్లు పడగొట్టగా టంగ్ మూడు వికెట్లతో ఇరగదీసాడు. అటు ఓక్స్ కూడా ఒక వికెట్ పడగొట్టగా... గిల్ అనవసరంగా రన్ అవుట్ అయ్యాడు.
Next Story






