రేపు భారత్, ఇంగ్లాండ్ మధ్య తొలి టీ20.. ఇంగ్లాండ్ జట్టును ప్రకటించిన ఈసీబీ

by Harish |

టీమ్ ఇండియాతో తొలి టీ20కి ఇంగ్లాండ్ తుది జట్టు ఖరారైంది.

రేపు భారత్, ఇంగ్లాండ్ మధ్య తొలి టీ20.. ఇంగ్లాండ్ జట్టును ప్రకటించిన ఈసీబీ
X

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియాతో తొలి టీ20కి ఇంగ్లాండ్ తుది జట్టు ఖరారైంది. బుధవారం కోల్‌కతాలో మ్యాచ్ జరగనుండగా.. ఒక రోజు ముందుగానే మంగళవారం ఇంగ్లాండ్ అండ్ వేల్స్(ఈసీబీ) బోర్డు తమ ప్లేయింగ్ 11ను ప్రకటించింది. కెప్టెన్ బట్లర్‌కు బదులు ఫిల్ సాల్ట్ వికెట్ కీపర్‌‌గా వ్యవహరించనున్నాడు. సాల్ట్, బక్కెట్ ఓపెనర్లు రానుండగా.. బట్లర్, బ్రూక్, లివింగ్‌స్టోన్‌లతో ఇంగ్లాండ్ బ్యాటింగ్ దళం బలంగా కనిపిస్తున్నది. గతేడాది నవంబర్‌లో చివరి టీ20 ఆడిన జాకబ్ బెథెల్‌కు తుది జట్టులో చోటు దక్కింది. అలాగే, 13 నెలల తర్వాత అట్కిన్సన్ టీ20 మ్యాచ్ ఆడబోతున్నాడు. ఆర్చర్, మార్క్‌వుడ్, అట్కిన్సన్ పేస్ దళాన్ని మోయనుండగా.. ఏకైక స్పెన్నర్‌గా ఆదిల్ రషీద్‌‌ను తీసుకున్నారు. మొత్తంగా ఇంగ్లాండ్ జట్టు బ్యాటింగ్, బౌలింగ్ పరంగా చాలా పటిష్టంగా ఉంది.

ఇంగ్లాండ్ తుది జట్టు

బెన్ డక్కెల్, ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్(కెప్టెన్), హ్యారీ బ్రూక్, లివింగ్‌స్టోన్, జాకబ్ బెథెల్, జేమీ ఓవర్టన్, అట్కిన్సన్, ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్‌వుడ్.


Next Story