అల్లా పైన ఒట్టు.. టీమిండియాపై ఫైనల్లో ప్రతికారం తీర్చుకుంటాం - పాక్ వార్నింగ్

by velandi.Saikiran |

టీమిండియా కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్. ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ లో... ఇండియా అ

అల్లా పైన ఒట్టు.. టీమిండియాపై ఫైనల్లో ప్రతికారం తీర్చుకుంటాం  - పాక్ వార్నింగ్
X

దిశ‌, వెబ్ డెస్క్ : ఆసియా కప్ 2025 టోర్నమెంట్ లో భాగంగా.... టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఇటీవల మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. పాకిస్తాన్ జట్టుపై ఏకంగా ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది టీమిండియా. అటు పాకిస్తాన్ మాత్రం... చిత్తుచిత్తుగా టీమిండియా చేతిలో ఓడిపోయింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ప్లేయర్లపై దారుణంగా ట్రోలింగ్ జరుగుతోంది. బ్యాట్స్మెన్ అలాగే బౌలర్లు దారుణంగా విఫలం కావడంతో... పాకిస్తాన్ ఓడిపోయింది.

ఈ మ్యాచ్ అనంతరం... పాకిస్తాన్ ప్లేయర్లకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు టీం ఇండియా ప్లేయర్లు. ఇప్పుడు ఈ అంశం పెద్ద వివాదంగా మారింది. ఇలాంటి నేపథ్యంలో టీమిండియా కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్. ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ లో... ఇండియా అంతు చూస్తామని హెచ్చరించారు. అప్పుడు తమ జట్టు గెలిచి టైటిల్ ఎగరేసుకు వెళ్తుందని... జోష్యం చెప్పారు తన్వీర్. దీంతో అతను చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

Next Story