బంగ్లాదేశ్ క్రికెటర్లకు గుడ్ న్యూస్..భారీగా పెరిగిన జీతాలు

by velandi.Saikiran |

మహిళా క్రికెటర్లకు వన్డే ఫీజును రూ.754 నుంచి రూ.11, 310 వ‌ర‌కు అమాంతం పెంచేసింది.

బంగ్లాదేశ్ క్రికెటర్లకు గుడ్ న్యూస్..భారీగా పెరిగిన జీతాలు
X

దిశ‌, వెబ్ డెస్క్‌: బంగ్లాదేశ్ క్రికెటర్లకు అదిరిపోయే శుభవార్త. ఆ దేశ క్రికెటర్ల జీతాలు భారీగా పెరిగాయి. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డును ప్రక్షాళన చేస్తున్న తమీమ్ ఇక్బాల్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. బంగ్లాదేశ్ క్రికెట‌ర్ల‌ జీతాలను పెంచాలని క‌మిటీ సిఫార‌స్ చేసింది. దీంతో మహిళా క్రికెటర్లకు వన్డే ఫీజును రూ.754 నుంచి రూ.11, 310 వ‌ర‌కు అమాంతం పెంచేసింది.

అలాగే టీ20 క్రికెట్ లో రూ. 7540 వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో ఫస్ట్ క్లాస్ క్రికెట్ ప్లేయర్లకు రూ.15,080 వరకు హైక్ ఇచ్చింది బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది. ఇక గతంలో పురుషుల క్రికెటర్లకు ఓ మ్యాచ్ కు సుమారు రూ. 26 వేల జీతం ఉండేదన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కేటగిరి Aలో ఉన్న ప్లేయర్లకు 49 వేల రూపాయలు అందించేందుకు సిద్ధం అయ్యారు. కేటగిరి బీ ప్లేయర్లకు రూ. 37,000, కేటగిరి సీ ప్లేయర్లకు రూ.30,000లుగా సవరించారు.

Next Story