Taipei Open : రెండో రౌండ్‌లోనే శ్రీకాంత్ ఇంటికి.. ఆయుశ్, ఉన్నతి క్వార్టర్స్‌కు క్వాలిఫై

by Harish |

తైపీ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ ప్లేయర్, తెలుగు కుర్రాడు కిదాంబి శ్రీకాంత్ నిరాశపరిచాడు.

Taipei Open : రెండో రౌండ్‌లోనే శ్రీకాంత్ ఇంటికి.. ఆయుశ్, ఉన్నతి క్వార్టర్స్‌కు క్వాలిఫై
X

దిశ, స్పోర్ట్స్ : తైపీ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ ప్లేయర్, తెలుగు కుర్రాడు కిదాంబి శ్రీకాంత్ నిరాశపరిచాడు. తొలి రౌండ్‌లో నెగ్గి శుభారంభం చేసిన అతను రెండో రౌండ్‌లోనే ఇంటిదారిపట్టాడు. మరో భారత యువ షట్లర్ ఆయుశ్ శెట్టి అతనికి షాక్ ఇచ్చాడు. గురువారం జరిగిన మెన్స్ సింగిల్స్ రెండో రౌండ్‌లో శ్రీకాంత్‌పై 16-21, 21-15, 17-21 తేడాతో ఆయుశ్ పోరాడి గెలిచాడు. రెండో రౌండ్‌లో గెలుపుతో ఆయుశ్ క్వార్టర్ ఫైనల్స్‌లో అడుగుపెట్టాడు. మరో తెలుగు కుర్రాడు తరుణ్ మన్నెపల్లి కూడా రెండో రౌండ్‌లోనే నిష్ర్కమించాడు. ఇండోనేషియాకు చెందిన ఉబైదుల్లా చేతిలో 2-13, 21-9 తేడాతో ఓడిపోయాడు. ఇక, ఉమెన్స్ సింగిల్స్‌లో భారత యువ క్రీడాకారిణి ఉన్నతి హుడా జోరు కొనసాగుతోంది. వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసి క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకుంది. రెండో రౌండ్‌లో ఉన్నతి 21-12, 21-7 తేడాతో చైనీస్ తైపీ షట్లర్ లిన్ సిహ్ యున్‌పై గెలుపొందింది. స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శించిన ఉన్నతి కేవలం 27 నిమిషాల్లోనే మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. శుక్రవారం జరిగే క్వార్టర్స్‌లో ఆమె చైనీస్ తైపీకే చెందిన హంగ్ యి టింగ్‌తో తలపడనుంది.


Next Story