- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
T20WorldCupFinal: టీమిండియా అభిమానులకు కొత్త టెన్షన్
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా రేపు ఆదివారం హైవోల్టేజ్ మ్యాచ్ జరుగనుంది.

దిశ, వెబ్‌డెస్క్: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా రేపు ఆదివారం హైవోల్టేజ్ మ్యాచ్ జరుగనుంది. ఫైనల్ మ్యాచ్‌లో టైటిల్ కోసం న్యూజిలాండ్-భారత్ జట్లు తలపడనున్నాయి. గుజరాత్, అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ మైదానం దీనికి వేదికైంది. సెమీ ఫైనల్‌లో అద్భుత ప్రదర్శనతో రెట్టింపు ఉత్సాహంతో ఉన్న కివీస్‌ను.. కాస్త తడబడుతూ ఫైనల్‌కు చేరుకున్నా టీమిండియా ఢీకొట్టనుంది.
ఆ స్టేడియం అంటే భయపడాల్సిందే..
అయితే.. ఫైనల్ మ్యాచ్‌కు ముందు భారత అభిమానులకు కొత్త టెన్షన్ పట్టుకుంది. తుదిపోరు జరిగే అహ్మదాబాద్ స్టేడియంలో ఐసీసీ టోర్నమెంట్లలో ఇండియాకు మంచి రికార్డు లేదు. 2023 వన్డే వరల్డ్ కప్‌లో ఓటమి ఎరుగని భారత్ అహ్మదాబాదులో జరిగిన ఫైనల్లో కంగుతిని కప్పు కోల్పోయింది. తాజా వరల్డ్‌లో సౌతాఫ్రికాపై 76 రన్స్ తేడాతో ఓడిపోయింది. 2023 నుంచి భారత్ ICC టోర్నమెంట్లలో రెండే మ్యాచులు ఓడిపోగా ఆ రెండూ అహ్మదాబాద్‌లోనే జరగడం గమనార్హం. ఈ నేపథ్యంలో రేపేం జరుగబోతుందో అని అభిమానులు టెన్షన్ పడుతున్నారు.
టీమిండియాలో అందరూ ప్రమాదమే..
మరోవైపు రేపటి ఫైనల్ మ్యాచ్‌పై న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీమిండియాలో స్టార్ పేసర్ బుమ్రా నుంచి మాకు ముప్పు పొంచి ఉంది. అతని నుంచి తప్పకుండా మాకు సవాల్ తప్పదు. కానీ కేవలం బుమ్రాతోనే కాదు.. భారత జట్టులోని ప్రతి ఒక్క ప్లేయర్‌తోనూ మేం జాగ్రత్తగా ఉండాల్సిందే. బ్యాటింగ్ లేదా బౌలింగ్ విభాగాల్లో సమష్టిగా రాణిస్తూ వారు ఈ దశ వరకు చేరుకున్నారు. ఒక్కొక్కసారి ఒక్కో ప్లేయర్ ముందుకు వచ్చి జట్టును విజయ పథం వైపు నడిపించారు అని శాంట్నర్ పేర్కొన్నాడు.






