టీ20 వరల్డ్ కప్: పాకిస్తా‌న్ ముందు 176 పరుగుల లక్ష్యం.. చెలరేగిన ఇషాన్ కిషన్!

by Ramesh Naini |   (  Updated:2026-02-15 15:31:12  IST  )

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమ్ ఇండియా, నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ఫలితంగా పాకిస్తా‌న్ విజయం సాధించాలంటే 176 పరుగులు చేయాల్సి ఉంది.

టీ20 వరల్డ్ కప్: పాకిస్తా‌న్ ముందు 176 పరుగుల లక్ష్యం.. చెలరేగిన ఇషాన్ కిషన్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: (India vs Pakistan) టీ20 ప్రపంచకప్‌లో భాగంగా దాయాది దేశాల మధ్య జరుగుతున్న ఉత్కంఠ పోరులో భారత్ బ్యాటింగ్ ముగిసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమ్ ఇండియా, నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ఫలితంగా పాకిస్తా‌న్ విజయం సాధించాలంటే 176 పరుగులు చేయాల్సి ఉంది.

ఆకట్టుకున్న ఇషాన్ కిషన్..

భారత ఇన్నింగ్స్‌లో ఓపెనర్ ఇషాన్ కిషన్ (77) అద్భుతమైన హాఫ్ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. పాక్ బౌలర్లను ఎదుర్కొంటూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. అతనికి తోడుగా సూర్యకుమార్ యాదవ్ (32), శివం దూబే (27), తిలక్ వర్మ (25) విలువైన పరుగులు జోడించారు. మరోవైపు, పాక్ బౌలర్ల ధాటికి భారత టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ తడబడింది. హార్దిక్ పాండ్యా, అభిషేక్ శర్మ, అక్షర్ పటేల్ ముగ్గురూ ఖాతా తెరవకుండానే 'డకౌట్'గా పెవిలియన్ చేరారు. అక్షర్ పటేల్ క్యాచ్ అవుట్ కాగా, శివం దూబే రనౌట్‌గా వెనుదిరిగాడు. పాకిస్తాన్ బౌలర్లలో సయామ్ ఆయుబ్ మూడు వికెట్లు తీశాడు. షహీన్ అఫ్రిది, సల్మాన్ అఘా, ఉస్మాన్ తారిఖ్‌లు తలో వికెట్ పడగొట్టారు.

Next Story