ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓటమి..

by Malleboina Mahesh |   (  Updated:2023-02-07 06:03:23  IST  )

ఐసీసీ మహిళా టీ20 ప్రపంచకప్ లో భాగంగా.. భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన మొదటి వామ్‌అప్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా గెలిచింది.

ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓటమి..
X

దిశ, వెబ్‌డెస్క్: ఐసీసీ మహిళా టీ20 ప్రపంచకప్ లో భాగంగా.. భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన మొదటి వామ్‌అప్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా గెలిచింది. ఈ మ్యాచ్ లో మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 20 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి.. 129 పరుగులు చేసింది. అనంతరం 130 పరుగుల స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన భారత మహిళా జట్టు 15 ఓవర్లకు కేవలం 85 పరుగులు మాత్రమే చేసి ఆల్ అవుట్ అయింది. దీంతో ఆస్ట్రేలియా జట్టు మొదటి వామ్‌అప్ మ్యాచ్ లో భారతపై 44 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Also Read..

అబుదాబి ఓపెన్‌ మహిళల డబుల్స్‌ తొలి రౌండ్‌లో సానియా ఓటమి..

Next Story